దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ శతకంతో అదరగొట్టాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్నా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తోన్నాడు. 128 బంతుల్లో వంద పరుగులు చేసి కెరీర్లో 23వ సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున మొదటి శతకం చేసిన ఆటగాడు రోహిత్.
రబాడా వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి రోహిత్ క్యాచ్ ఇచ్చాడు. స్లిప్‌లో ఉన్న డూప్లెసిస్ క్యాచ్ జారవిడిచాడు. అప్పటికి రోహిత్ ఒక్కపరుగు మాత్రమే చేశాడు. దీనికి సఫారి జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది.
ఆరంభంలోనే ధావన్ ఔటైనా.. క్రీజులో పాతుకపోయి స్కోరు వేగం పెంచాడు రోహిత్. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ కొడుతూ భారత్‌ను లక్ష్య ఛేదన దిశగా తీసుకెళ్లతున్నాడు హిట్ మ్యాన్.