ప్రపంచకప్‌లో వరుస శతకాలతో దూసుకుపోతున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో 90 బంతుల్లో 100 పరుగులు పుర్తిచేశాడు. ఈ శతకంతో గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ. 2003 మెగాటోర్నీలో సౌరవ్ మూడు సెంచరీలు చేయగా.. ప్రస్తుతం 4 శతకాలతో దాదాను అధిగమించాడు రోహిత్.
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన హిట్ మ్యాన్ కెరీర్లో 26వ శతకాన్ని నమోదు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. హిట్ మ్యాన్‌కు ఇది వరుసగా రెండో శతకం. ఇంగ్లాండ్‌పైనా సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ప్రపంచకప్ టోర్నీలో 15 ఇన్నింగ్స్‌లో 5 శతకాలు చేశాడు. 2015 మెగాటోర్నీలో ఒకటి.. ఈ ప్రపంచకప్‌లో 4 సెంచరీలు నమోదు చేశాడు. ఈ శతకంతో పాంటింగ్(5), సంగక్కర(5)లను సమం చేశాడు. ఇంకో శతకం చేస్తే సచిన్(6) రికార్డు అందుకుంటాడు హిట్ మ్యాన్. ఓ మెగాటోర్నీలో ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు సంగక్కర(4) పేరిట ఉంది. ఆ రికార్డునూ సమం చేశాడు రోహిత్.
-
122*
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
57
140
1
18
102
100* today, and he's still going.
Rohit Sharma's #CWC19 campaign just gets better and better. #TeamIndia | #BANvIND pic.twitter.com/iYyZRYmI46
">122*
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
57
140
1
18
102
100* today, and he's still going.
Rohit Sharma's #CWC19 campaign just gets better and better. #TeamIndia | #BANvIND pic.twitter.com/iYyZRYmI46122*
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
57
140
1
18
102
100* today, and he's still going.
Rohit Sharma's #CWC19 campaign just gets better and better. #TeamIndia | #BANvIND pic.twitter.com/iYyZRYmI46
ఈ ఏడాది 1000 పరుగులు చేసిన హిట్ మ్యాన్
ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు చేశాడు రోహిత్(1093). బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. బంగ్లా బౌలర్ మోర్తాజా వేసిన తొలి ఓవర్లో సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు వెయ్యి పరుగులకు ఏడు పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికి 5 శతకాలు చేశాడు రోహిత్. ఈ ప్రపంచకప్‌లోనే 4 సెంచరీలతో రాణించాడు.
శతకం అనంతరం రోహిత్(104) సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి బంతిని ఫోర్ కొట్టిన రోహిత్ రెండో బంతికి లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇది చదవండి: టీమిండియాను ఓడించగలం: డిసిల్వా