ETV Bharat / sports

ప్రాక్టీస్ మ్యాచ్​లకు అడ్డుతగిలిన వరుణుడు

ఆదివారం జరగాల్సిన ప్రపంచకప్​ ప్రాక్టీస్​ మ్యాచ్​లు వర్షం కారణంగా రద్దయ్యాయి. వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ 12.4 ఓవర్ల జరగగా.. బంగ్లాదేశ్ - పాకిస్థాన్ మ్యాచ్​లో ఒక్క బంతి కూడా పడలేదు.

ప్రాక్టీస్
author img

By

Published : May 27, 2019, 9:07 AM IST

ప్రపంచకప్​ ప్రాక్టీస్​ మ్యాచ్​లకు వర్షం అంతరాయం కలిగించింది. ఈ కారణంగా ఇంగ్లాండ్ బ్రిస్టల్​లో జరగాల్సిన రెండు ప్రాక్టీస్​ మ్యాచ్​లు రద్దయ్యాయి. వెస్టిండీస్​ - దక్షిణాఫ్రికా మధ్య వార్మప్ మ్యాచ్​ 12.4 ఓవర్లు వరకు సాగగా.. బంగ్లాదేశ్ - పాకిస్థాన్ మ్యాచ్​ ఒక్క బంతి కూడా పడలేదు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఆమ్లా(51) అర్ధశతకంతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ డికాక్ 30 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థులకు దడ పుట్టించారు. 12.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మైదానాన్ని ముంచెత్తింది. ఔట్ ఫీల్డ్​ చిత్తడిగా మారి.. ఆటకు సహకరించలేదు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.