పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ విఫలమైంది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు సాధించింది.
ప్రారంభం నుంచి పాకిస్థాన్ బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం ప్రదర్శించారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. షహీన్ అఫ్రిదీ, మహ్మద్ ఆమిర్ ధాటికి మొదటి 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది కివీస్. గప్తిల్ (5), మున్రో (12), టేలర్ (3), లాథమ్ (1) విఫలమయ్యారు.
కివీస్ సారథి విలియమ్సన్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నీషమ్ కాసేపు జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్‌కు 37 పరుగులు జోడించిన అనంతరం విలియమ్స్‌న్ (41)ను షాదాబ్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది కివీస్. 30 ఓవర్లకు 94 పరుగులు చేసింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
-
An ODI career-best 97* from Neesham and his 132-run stand with de Grandhomme helped New Zealand recover from 83/5 to post 237/6.
— ICC (@ICC) June 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Can they defend this?
For scores and highlights, download the #CWC19 app ⬇️
APPLE 🍎 https://t.co/VpYh7SIMyP
ANDROID 🤖 https://t.co/cVREQ16w2N pic.twitter.com/1iLOgTPw15
">An ODI career-best 97* from Neesham and his 132-run stand with de Grandhomme helped New Zealand recover from 83/5 to post 237/6.
— ICC (@ICC) June 26, 2019
Can they defend this?
For scores and highlights, download the #CWC19 app ⬇️
APPLE 🍎 https://t.co/VpYh7SIMyP
ANDROID 🤖 https://t.co/cVREQ16w2N pic.twitter.com/1iLOgTPw15An ODI career-best 97* from Neesham and his 132-run stand with de Grandhomme helped New Zealand recover from 83/5 to post 237/6.
— ICC (@ICC) June 26, 2019
Can they defend this?
For scores and highlights, download the #CWC19 app ⬇️
APPLE 🍎 https://t.co/VpYh7SIMyP
ANDROID 🤖 https://t.co/cVREQ16w2N pic.twitter.com/1iLOgTPw15
శతక భాగస్వామ్యం
నీషమ్, గ్రాండ్‌హోమ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడుతూ పరుగులు సాధించారు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధసెంచరీలు చేశారు. ఆరో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది నీషమ్-గ్రాండ్‌హోమ్ జోడి. అనంతరం 48 ఓవర్లో అనవసర పరుగుకు యత్నించి గ్రాండ్‌హోమ్ (64) రనౌట్‌గా వెనుదిరిగాడు. నీషమ్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.
పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. మహ్మద్ ఆమిర్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.