పాకిస్థాన్.. అంచనాలకు అందకుండా.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. ఎంత పెద్ద జట్టునైనా బోల్తా కొట్టిస్తుంది. అలాగే పసికూన జట్ల ముందు చతికిలబడుతుంది. ఈ ప్రపంచకప్‌లో మూడు విజయాలను నమోదు చేసిన పాక్ 1992 మెగాటోర్నీ ఫలితాలను పునరావృతం చేస్తోంది. అదే నిజమైతే కప్పు కైవసం చేసుకున్నా.. ఆశ్చర్య పోనక్కర్లేదు!
-
Right, NOW it's getting spooky.#WeHaveWeWill pic.twitter.com/qdCjRwGAJj
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Right, NOW it's getting spooky.#WeHaveWeWill pic.twitter.com/qdCjRwGAJj
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019Right, NOW it's getting spooky.#WeHaveWeWill pic.twitter.com/qdCjRwGAJj
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
1992 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న పాకిస్థాన్ ఓటమితో ఆ టోర్నీని ప్రారంభించిది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ తొలి మ్యాచ్‌లో విండీస్‌పై ఓడింది. 1992లో రెండో మ్యాచ్ గెలిచిన పాక్.. ఈ టోర్నీలోనూ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ టోర్నీలో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. ఈ మెగాటోర్నీలోనూ శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. 1992లో తాను ఆడిన 4, 5 మ్యాచుల్లో ఓడిన పాకిస్థాన్.. ఇప్పుడూ వరుసగా ఆస్ట్రేలియా, భారత్ చేతిలో పరాజయం చెందింది. ఆ టోర్నీలో 6, 7 మ్యాచుల్లో గెలిచిన దాయాది జట్టు.. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికా, కివీస్‌పై వరుస విజయాలను నమోదు చేసింది.
ఇప్పటికీ ఏడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ మూడింటిలో నెగ్గింది. మిగతా వాటిలోనూ భారీ విజయం సాధిస్తే.. పాక్ సెమీస్ చేరే అవకాశముంది. ఇందుకు నెట్ రన్‌రేట్ కూడా సహకరించాలి. 1992 ఫలితాలను పునరావృతం చేస్తోన్న పాక్.. అదే సెంటిమెంటుతో కప్పు గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
బర్మింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాదించింది పాకిస్థాన్. బాబర్ అజామ్(101) శతకంతో ఆకట్టుకోగా.. సొహైల్(68) అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది పాక్