ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, వాహబ్ రియాజ్ అరుదైన రికార్డు సాధించారు. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ 100 వన్డే క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ఘనత సాధించగా, వాహబ్ 787 రోజుల అనంతరం వికెట్ తీశాడు.
వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బెయిర్ స్టో సర్ఫరాజ్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్డేల్లో సర్ఫరాజ్‌కు ఆ క్యాచ్ వందోది. 54 మ్యాచుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
ఇంకో విశేషమేమంటే 787 రోజుల తర్వాత వన్దేల్లో వికెట్ తీసిన ఆటగాడిగా వాహబ్ రియాజ్ రికార్డు సృష్టించాడు. మొత్తానికి ఒక్క వికెట్‌తో ఇద్దరూ రెండు రికార్డులు అందుకున్నారు.