ప్రపంచకప్ ముగిసిన వారం తర్వాత ఫైనల్ ఫలితంపై ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ స్పందించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో గెలవడం ఆనందంగా ఉన్నా.. విజేతను నిర్ణయించిన విధానం సరిగా లేదన్నాడు. ఉత్కంఠగా సాగిన పోరులో ఈ టైటిల్‌కు అర్హులమైనా.. స్వల్ప తేడాతో విశ్వ విజేతగా నిలవడం వల్ల సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానని అభిప్రాయపడ్డాడు.
ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. విజేతను నిర్ణయించిన తీరు సరిగా లేదు. విజయం మాకు అనుకూలంగా వచ్చింది. ప్రతికూలంగా వచ్చుంటే.. అనే ఆలోచనే భయంకరంగా ఉంది. -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్
ఒక్క సంఘటనే మ్యాచ్ ఫలితం మార్చిందని తాను అనుకోవట్లేదని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.
ఒక్క సంఘటనే (గప్తిల్ ఓవర్ త్రోలో వచ్చిన ఆరు పరుగులు గురించి) మ్యాచ్ ఫలితం తారుమారు చేసిందని అనుకోవట్లేదు. మేమూ కష్టపడ్డాం.. ఈ విజయానికి అర్హులమే. -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్
ఫైనల్ తర్వాత న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్స్‌తో చాలా సార్లు మాట్లాడనని మోర్గాన్ చెప్పాడు.
మ్యాచ్ అయిన తర్వాత కేన్‌తో చాలా సార్లు మాట్లాడాను. ఫలితంపై ఇద్దరం చర్చించుకున్నాం. ఫైనల్ మ్యాచ్ కొన్నిసార్లు మా వైపు మళ్లింది.. కొన్ని సార్లు వాళ్లకు అనుకూలంగా మారింది. నా లాగే కేన్ కూడా ఇవన్నీ పట్టించుకోలేదని అనుకుంటున్నా. -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్
న్యూజిలాండ్‌తో జరిగిన తుదిపోరులో ఇంగ్లాండ్ ప్రపంచకప్ సొంతం చేసుకుంది. బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లీష్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.
ఇది చదవండి: వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు ప్రకటన