ETV Bharat / sports

WC19: ఆసీస్​పై భారత్​ అద్భుత విజయం - won

లండన్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో భారత్​ 36 పరుగుల తేడాతో గెలిచింది. శిఖర్​ ధావన్​ సెంచరీ (117)కి తోడు భారత బౌలర్లు బుమ్రా, భువి చెరో 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. ఆసీస్​ బ్యాట్స్​మెన్ స్మిత్, వార్నర్, అలెక్స్​ అర్ధశతకాలతో రాణించినప్పటికీ కంగారూ జట్టును గెలిపించలేకపోయారు.

భారత్ విజయం
author img

By

Published : Jun 9, 2019, 11:40 PM IST

Updated : Jun 10, 2019, 9:34 AM IST

ఆసీస్​పై భారత్​ అద్భుత విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కంగారూ జట్టుకు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్​ చేసిన ఆసీస్​ 316 పరుగులకు ఆలౌటైంది. కంగారూ బ్యాట్స్​మెన్ స్మిత్ (69), వార్నర్ (56), అలెక్స్​ (55) అర్ధశతకాలు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్ చెరో 3 వికెట్లు, చాహల్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.

శతకంతో ఆకట్టుకున్న శిఖర్ ధావన్​కు 'మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు' దక్కింది.

353 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్​ ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు ఫించ్ (36), డేవిడ్ వార్నర్ 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 14వ ఓవర్లో ఫించ్ రనౌట్​ కాగా.. అనంతరం స్మిత్, వార్నర్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. డేవిడ్ వార్నర్​ను ఔట్​ చేసి చాహల్ ఈ జోడిని విడదీశాడు.

తర్వాత ఖవాజాతో కలిసి స్కోరు వేగం పెంచాడు స్మిత్​. ఈ క్రమంలో స్మిత్ 60 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వేగంగా ఆడుతూ బుమ్రా బౌలింగ్​లో ఖవాజా ఔటయ్యాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్​వెల్ ధాటిగా ఆడాడు. వరుసగా బౌండరీలు కొడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. 14 బంతుల్లో 28 పరుగులు చేశాడు మ్యాక్స్​వెల్​.

మలుపు తిప్పిన భువనేశ్వర్

ఒకే ఓవర్లో రెండు వికెట్లు ఆసీస్​ను దెబ్బతీశాడు భువి. 40వ ఓవర్​ నాలుగో బంతికి ధాటిగా ఆడుతోన్న స్మిత్​ను ఔట్ చేసిన భువి తర్వాతి బంతికే స్టాయినిస్​ను డకౌట్ చేసి పెవిలియన్ పంపాడు. తర్వాతి ఓవర్లో చాహల్​ మ్యాక్స్​వెల్​ను ఔట్​ చేశాడు.

చివర్లో వేగంగా ఆడిన అలెక్స్ కేరీ అర్ధశతకంతో రాణించినప్పటికీ అప్పటికే రన్​రేట్​ భారీగా పెరిగింది. ఆఖరి ఓవర్ చివరి బంతికి జంపాను ఔట్ చేసిన భువి భారత్​కు అద్భుత విజయాన్ని అందించాడు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్​లో ధావన్​ (117) శతకంతో అదరగొట్టగా.. కోహ్లీ (82), రోహిత్ (56) పరుగులతో ఆకట్టుకున్నారు. ఆసీస్​ బౌలర్లలో స్టాయినిస్ రెండు వికెట్లతో రాణించగా.. స్టార్క్, కౌల్టర్​ నైల్, కమిన్స్​ తలో వికెట్ తీసుకున్నారు.

ఇదిచదవండి: WC19: 'శిఖర'మే హద్దు.. ఆసీస్ లక్ష్యం 353

Intro:Body:

oo

Conclusion:
Last Updated : Jun 10, 2019, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.