9, 1, 1.. ఇవి అంకెలు కాదు.. ప్రపంచకప్ టోర్నీ సెమీస్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లి చేసిన పరుగులు. అద్భుతంగా రాణించే కోహ్లి నాకౌట్ సమరానికి వచ్చే సరికి ఆకట్టుకోలేకపోతున్నాడు. లక్ష్యఛేదనల్లో మంచి రికార్డున్న విరాట్ ఐసీసీ నాకౌట్ పోరులో చేతులెత్తేస్తున్నాడు.
2011 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్.. పాకిస్థాన్‌తో తలపడింది.. ఆ మ్యాచ్‌లో 21 బంతులాడిన కోహ్లీ 9 పరుగులే చేశాడు. అప్పుడు టీమిండియా గెలిచినప్పటికీ విరాట్ మాత్రం రాణించలేదు.
2015 ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది టీమిండియా. ఆ మ్యాచ్‌లో 13 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇందులో ఆసీస్‌పై భారత్ 95 పరుగుల తేడాతో ఓడింది.
2019 వరల్డ్‌కప్ సెమీస్‌లోనూ టీమిండియా న్యూజిలాండ్‌పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ ఒక్క పరుగే చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. పాక్ చేతిలో చిత్తుగా ఓడింది.
ఛేదనలో మంచి రికార్డు ఉన్న కోహ్లి నాకౌట్ పోటీల్లో నిరాశ పరుస్తున్నాడు. ఒత్తిడి ప్రభావమో, ప్రత్యర్థుల వ్యూహాలు అంచనా వేయలేకో తెలియదు కానీ కీలక క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌ల్లో ఇబ్బంది పడుతున్నాడన్నది వాస్తవం.
ఇది చదవండి: WC19: చిరకాల ప్రత్యర్థుల మధ్య రసవత్తర సెమీస్