ETV Bharat / sports

ప్రాక్టీస్ మ్యాచ్​లో భారత్ 179కి ఆలౌట్​ - west indies

న్యూజిలాండ్​తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్​లో భారత్ 179 పరుగులకు ఆలౌటైంది. జడేజా (54), పాండ్య (30) మినహా మిగతా బ్యాట్స్​మెన్​ పెద్దగా ఆకట్టుకోలేదు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు తీయగా..​ నీషమ్ 3 వికెట్లతో రాణించాడు.

ఇండియా
author img

By

Published : May 25, 2019, 6:26 PM IST

లండన్ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న ప్రపంచకప్​ ప్రాక్టీస్ మ్యాచ్​లో టీమిండియా ఓ మాదిరి స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​ 179 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (54), హార్ధిక్​ పాండ్య (30) మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. ఆరంభం నుంచి కివీస్ బౌలర్లు భారత్​పై ఆధిపత్యం చెలాయించారు. బౌల్ట్ 4 వికెట్లు తీయగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

భారత్​ ఇన్నింగ్స్​ మొదటి నుంచి పేలవంగా సాగింది. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (2)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు బౌల్ట్​. అనంతరం వెంటవెంటనే శిఖర్ ధావన్ (2), కే ఎల్ రాహుల్​ను (6) పెవిలియన్ చేర్చి భారత్​ను దెబ్బతీశాడు. విరాట్​ను (18) గ్రాండ్​హోమ్​ బౌల్డ్​ చేశాడు.

39కే నాలుగు వికెట్ల కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది భారత్. ఈ సమయంలో హార్ధిక్ పాండ్య (30), ధోనీ కాసేపు నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని ఆపారు. వేగంగా ఆడుతూ నీషమ్​ బౌలింగ్​లో క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు పాండ్య. అనంతరం ధోని కూడా సౌధీ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు.

జడ్డు అర్ధశతకం...

చివర్లో జడేజా కుల్దీప్​ను (19) అడ్డుపెట్టుకుని ఇన్నింగ్స్​ను నడిపించాడు. వేగంగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. పరుగులు చేసేందుకు కష్టమైన పిచ్​పైనే చక్కటి ప్రదర్శన చేశాడు. కుల్దీప్ నిలకడగా ఆడి జడేజాకు సాయపడ్డాడు. వీరిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో ఫెర్గ్యూసన్ బౌలింగ్​లో జడేజా ఔటయ్యాడు. ఆ వెనువెంటనే కుల్దీప్​ పెవిలియన్​ చేరాడు. భారత్​ ఇన్నింగ్స్​ 179 పరుగుల వద్ద ముగిసింది.

New Delhi, May 25 (ANI): After the 2019 Lok Sabha verdict gave a second term to Prime Minister Narendra Modi-led NDA with a thumping majority, PM Modi addressed PMO staff on Friday in Delhi, he said, "My thinking is to build PMO efficient. I am thankful to the PMO staff and we promise to work like this in future."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.