ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ పోరులో నెగ్గి టీమిండియా వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరుకుంది. 315 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడిన బంగ్లాదేశ్ 286 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో షకిబ్(66, 74 బంతుల్లో), సైఫుద్దీన్(51*, 38 బంతుల్లో) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. మిగతా వారు ఓ మోస్తరుగా ఆడారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీశాడు. పాండ్య 3.. భువి, చాహల్, షమీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
-
How do you play this man at the death?
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Jasprit Bumrah: 4/55 from 10 overs 👏 👏 #TeamIndia | #BANvIND | #CWC19 pic.twitter.com/T5UHuPCN8n
">How do you play this man at the death?
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
Jasprit Bumrah: 4/55 from 10 overs 👏 👏 #TeamIndia | #BANvIND | #CWC19 pic.twitter.com/T5UHuPCN8nHow do you play this man at the death?
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
Jasprit Bumrah: 4/55 from 10 overs 👏 👏 #TeamIndia | #BANvIND | #CWC19 pic.twitter.com/T5UHuPCN8n
టాపార్డర్ టాప్ లేపారు..
315 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన బంగ్లా ఆరంభంలో నిలకడగా ఆడింది. పది ఓవర్లకు 40 పరుగులు చేసింది. పదో ఓవర్లో తమీమ్‌ను ఔట్ చేసిన షమి బంగ్లాను దెబ్బతీశాడు. కాసేపటికే మరో ఓపెనర్ సౌమ్యా సర్కార్‌ను పెవిలియన్ చేర్చాడు పాండ్య. అనంతరం వచ్చిన షకిబ్ - ముష్ఫీకర్ జోడి నిలకడగా ఆడింది. ముష్ఫీకర్‌ను(24) ఔట్ చేసి బంగ్లాను దెబ్బతీశాడు చాహల్. కొద్ది విరామంలో లిటన్ దాస్(22), మోసాదేక్ హోస్సెన్(3) పెవిలియన్ బాట పట్టారు.
-
Heartbreak for Bangladesh, joy for India – the two-time champions win by 28 runs to book their place in the semi-finals!#TeamIndia | #BANvIND | #CWC19 pic.twitter.com/PgMjIWSGJa
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Heartbreak for Bangladesh, joy for India – the two-time champions win by 28 runs to book their place in the semi-finals!#TeamIndia | #BANvIND | #CWC19 pic.twitter.com/PgMjIWSGJa
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019Heartbreak for Bangladesh, joy for India – the two-time champions win by 28 runs to book their place in the semi-finals!#TeamIndia | #BANvIND | #CWC19 pic.twitter.com/PgMjIWSGJa
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
అనంతరం బంగ్లా ఆల్‌రౌండర్ షకిబుల్ నిలకడగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. 74 బంతుల్లో 66 పరుగులు చేశాడు. కాసేపటికి పాండ్య బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చివర్లో గుబులు రేపిన సైఫుద్దిన్..
179 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్న బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేసింది సైఫుద్దీన్(51) - సబ్బీర్ రెహమాన్(36) జోడి. వీరిద్దరూ ఎడపెడా బౌండరీలు బాదుతూ 66 పరుగులు విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు.
-
50 for Saifuddin 👏 👏
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Bangladesh just 30 runs away from victory!#CWC19 | #BANvIND pic.twitter.com/tG7XdcS2GV
">50 for Saifuddin 👏 👏
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
Bangladesh just 30 runs away from victory!#CWC19 | #BANvIND pic.twitter.com/tG7XdcS2GV50 for Saifuddin 👏 👏
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
Bangladesh just 30 runs away from victory!#CWC19 | #BANvIND pic.twitter.com/tG7XdcS2GV
అనంతరం సబ్బీర్‌ను భువి ఔట్ చేసినా.. సైఫుద్దీన్ మాత్రం తగ్గలేదు. చివర్లో బంగ్లాకు విజయానికి చేరువ చేసే ప్రయత్నం చేశాడు. వరుసగా ఫోర్లతో ఎదురుదాడికి దిగి భారత్ అభిమానుల్లో గుబులురేపాడు. అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కానీ టెయిలెండర్లు కావడం వల్ల నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ సహకారం అందలేదు. చివరి వరకు పోరాడి 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
48వ ఓవర్ వేసిన బుమ్రా వరుస బంతుల్లో రుబెల్(9), ముస్తాఫిజుర్‌ను(0) ఔట్ చేసి భారత్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. చివరి నాలుగు వికెట్లు తీయడానికి టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది.
-
India join Australia in the semi-finals!#CWC19 | #BANvIND pic.twitter.com/o5QCRYlIY3
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">India join Australia in the semi-finals!#CWC19 | #BANvIND pic.twitter.com/o5QCRYlIY3
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019India join Australia in the semi-finals!#CWC19 | #BANvIND pic.twitter.com/o5QCRYlIY3
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాట్స్‌మెన్‌ల్లో రోహిత్(104) శతకంతో విజృంభించగా.. రాహుల్(77) అర్ధశతకంతో మెరిశాడు. పంత్ 48 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు.