ETV Bharat / sports

రెండో టెస్టు: అరుదైన రికార్డులపై మయాంక్​, ఇషాంత్​ కన్ను

author img

By

Published : Feb 28, 2020, 11:28 AM IST

Updated : Mar 2, 2020, 8:26 PM IST

క్రైస్ట్​చర్చ్​ వేదికగా భారత్​- న్యూజిలాండ్​ మధ్య శనివారం రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఇషాంత్​, మయాంక్​ చెరో రికార్డుపై కన్నేశారు.

India vs New Zealand 2nd Test: Ishant, Mayank will catch  new records in Christchurch?
రెండో టెస్టు: అరుదైన రికార్డులపై మయాంక్​, ఇషాంత్​ కన్ను

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓటమిపాలైన భారత్​... శనివారం రెండో మ్యాచ్‌లో తలపడనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో క్లీన్​స్వీప్​ అయిన కోహ్లీసేన ఈ టెస్టు గెలవకపోతే టెస్టు సిరీస్‌లోనూ వైట్‌వాష్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ తప్పక గెలవాల్సి ఉంది. గత మ్యాచ్​లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌, పేసర్‌ ఇషాంత్‌ శర్మ కాస్త ఫర్వాలేదనిపించారు. వీళ్లిద్దరూ కీలకమైన రెండో టెస్టులో ఎలా రాణిస్తారో చూడాలి. ఒకవేళ మయాంక్‌, ఇషాంత్‌ మరోసారి చెలరేగితే.. కొత్త రికార్డులు ఖాతాలో చేరనున్నాయి.

ఇషాంత్​ 300 వికెట్లు...

తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసిన ఇషాంత్‌శర్మ.. ప్రస్తుతం సుదీర్ఘ ఫార్మాట్‌లో 297 వికెట్లతో కొనసాగుతున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో మరో మూడు వికెట్లు తీస్తే 300 వికెట్ల క్లబ్‌లో చేరనున్నాడు. లంబూ.. ఈ ఫీట్​ సాధిస్తే టీమిండియా తరఫున ఆరో బౌలర్‌గా, మూడో పేసర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు కపిల్‌దేవ్‌, జహీర్‌ఖాన్‌, అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌సింగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.

గతంలో 300 వికెట్ల మైలురాయిని 54 టెస్టుల్లోనే అత్యంత వేగంగా అందుకొని చరిత్ర సృష్టించాడు అశ్విన్​. ఇషాంత్​ మాత్రం చాలా ఆలస్యంగా (97 టెస్టులు ప్రస్తుతం) ఈ రికార్డు చేరుకోనున్నాడు.

వేయి పరుగుల వీరుడు..

టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 10 టెస్టుల్లో (15 ఇన్నింగ్స్‌) 964 పరుగులు చేశాడు. రెండో టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌ల్లో మరో 36 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో వినోద్‌ కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు.

ఇదీ చదవండి...

రెండో టెస్టు: పృథ్వీ షా స్థానంలో శుభ్​మన్​ గిల్​!

Last Updated : Mar 2, 2020, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.