లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. వందలోపే 6 వికెట్లు కోల్పోయి పరుగుల కోసం పాకులాడుతోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కె ఎల్ రాహుల్ వెంటవెంటనే పెవిలియన్ చేరారు. 21ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది కోహ్లీ సేన. క్రీజులో ధోనీ(11), జడేజా(2) ఉన్నారు.
39కే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. బౌల్ట్ 3 వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, బ్లండెల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌పై ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రెండో ఓవర్లనే రోహిత్ శర్మను(2) ఎల్బీడబ్ల్యూ చేశాడు కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్. అనంతరం వెంటవెంటనే శిఖర్‌ధావన్(2), లోకేశ్ రాహుల్‌ను ఔట్ చేశాడు బౌల్ట్. కాసేపు కోహ్లీ(18) నిలకడగా ఆడినా.. గ్రాండ్‌హోమ్ చేతిలో ఔటయ్యాడు. హర్ధిక్ను(30) పెవిలియన్ పంపాడు బ్లండెల్.