లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో పోరులో దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్లు ఇమాముల్ హాక్, ఫకర్ జమాన్‌ను ఔట్ చేసి... ఐసీసీ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మెగాటోర్నీలో ఇప్పటివరకు మొత్తం 39 వికెట్లు తీశాడీ పరాశక్తి ఎక్స్‌ప్రెస్. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసి 41 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు తాహిర్.
![imran south african highest wicket taker in a icc worldcup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3641686_openers2.jpg)
ఒకే దగ్గర ఆ ఇద్దరూ...
పాకిస్థాన్ జట్టులోని ఇద్దరు ఓపెనర్లు ప్రొటీస్‌తో మ్యాచ్‌లో అర్ధశతకాలు కోల్పోయారు. ఇమాముల్ హక్ 57 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఫకర్ జమాన్ 50 బంతుల్లో 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరిని ఇమ్రాన్ తాహిర్ ఒకే స్కోరు(44) వద్ద ఔట్ చేయడం విశేషం.
![imran south african highest wicket taker in a icc worldcup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3641686_openers.jpg)