భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్‌శర్మ మరో మైలురాయి అందుకున్నాడు. ఆస్ట్రేలియా- భారత్ మధ్య పోరులో ఈ హిట్‌మ్యాన్ 57 పరుగులు (79 బంతుల్లో; 3 ఫోర్లు, 1 సిక్స్) సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లోనే వన్డేల్లో ఆస్ట్రేలియాపై 2 వేల పరుగుల మార్కు చేరుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఆసీస్‌పై 37 ఇన్నింగ్స్‌లలోనే రోహిత్ 2 వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. సచిన్ 40 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.
ఆసీస్‌పై ఈ మైలురాయి అందుకున్న వారిలో రోహిత్, సచిన్ సహా వీవ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) ఉన్నారు. ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్.
-
Rohit Sharma becomes the fourth batsman in world cricket to hit 2,000 ODI runs against Australia 👏 #TeamIndia pic.twitter.com/c6I5iUpuy1
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rohit Sharma becomes the fourth batsman in world cricket to hit 2,000 ODI runs against Australia 👏 #TeamIndia pic.twitter.com/c6I5iUpuy1
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019Rohit Sharma becomes the fourth batsman in world cricket to hit 2,000 ODI runs against Australia 👏 #TeamIndia pic.twitter.com/c6I5iUpuy1
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
అందరి కంటే మిన్న...
ఒక జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 2 వేల వన్డే పరుగుల్ని సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఒక జట్టుపై వేగంగా 2 వేల పరుగుల్ని చేసిన ఆటగాళ్లలో రిచర్డ్స్, కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు. గతంలో కోహ్లీ శ్రీలంకపై 2 వేల పరుగుల్ని పూర్తి చేశాడు. అయితే ఈ మార్కు అందుకోడానికి విరాట్‌కు 44 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.