ఆసీస్‌తో మ్యాచ్‌లో ఓటమిపై స్పందించాడు వెస్టిండీస్ సారథి హోల్డర్. స్మిత్ అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడని కొనియాడాడు. అదే తమకు విజయాన్ని దూరం చేయడానికి ఓ కారణమని మ్యాచ్ అనంతరం వెల్లడించాడీ కరేబియన్ ఆటగాడు.
ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓడింది విండీస్. ఓ దశలో మ్యాచ్ గెలిచేలా కనిపించిన కరేబియన్ జట్టు.. చివర్లో స్టార్క్ ధాటికి తడబడి పరాజయం పాలైంది. తొలుత బౌలింగ్, ఫీల్డింగ్‌లో తప్పిదాలతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసేందుకు దోహదపడింది.
-
"That's sport. We've just got to learn from it."
— Cricket World Cup (@cricketworldcup) June 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
West Indies skipper #JasonHolder reflects on their defeat to Australia ⬇️ pic.twitter.com/kuCMt1fi7X
">"That's sport. We've just got to learn from it."
— Cricket World Cup (@cricketworldcup) June 7, 2019
West Indies skipper #JasonHolder reflects on their defeat to Australia ⬇️ pic.twitter.com/kuCMt1fi7X"That's sport. We've just got to learn from it."
— Cricket World Cup (@cricketworldcup) June 7, 2019
West Indies skipper #JasonHolder reflects on their defeat to Australia ⬇️ pic.twitter.com/kuCMt1fi7X
''మేం విజయానికి చేరువగా వచ్చి ఓ మంచి అవకాశాన్ని కోల్పోయాం. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటాం. కానీ.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినందుకు నిరాశలో ఉన్నాం.
క్రికెట్లో భాగస్వామ్యాలు ప్రధానమైనవి. అలెక్స్ కేరీ, నాథన్ కౌల్టర్నైల్లను సమన్వయపరుచుకుంటూ స్మిత్ ఆడిన తీరు అద్భుతం. కౌల్టర్‌నైల్ 60 పరుగుల వద్దే అతని క్యాచ్ విడిచిపెట్టాం. అదెంత విలువైందో తర్వాతే తెలిసింది.''
- హోల్టర్, విండీస్ సారథి
ప్రస్తుత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన విండీస్... ఆసీస్‌పై ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో జూన్ 10న సౌతాఫ్రికాతో తలపడనుంది విండీస్.
తమ బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. సమష్టిగా రాణించాల్సిన అవసరముందన్నాడు హోల్డర్. తప్పులను తెలుసుకొని తర్వాతి మ్యాచుల్లో మరింత బాధ్యతాయుతంగా ఆడతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని.. కంగారూ విజయంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు.