ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అఫ్గాన్‌పై నెగ్గి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతున్న అఫ్గాన్.. అతిథ్య జట్టుపై గెలిచి సంచనం సృష్టించాలని తహతహలాడుతోంది.
స్టార్ ఆటగాళ్లు గాయాల పాలు కావడం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు తలనొప్పిగా మారింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఓపెనర్ జేసన్ రాయ్ ఫిట్నెస్ సమస్యలతో మైదానాన్ని వీడడం ఇంగ్లాండ్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.
-
🇧🇩: 8️⃣ ➡️ 5️⃣ #CWC19 | #WIvBAN pic.twitter.com/gkGDr5pPon
— Cricket World Cup (@cricketworldcup) June 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">🇧🇩: 8️⃣ ➡️ 5️⃣ #CWC19 | #WIvBAN pic.twitter.com/gkGDr5pPon
— Cricket World Cup (@cricketworldcup) June 17, 2019🇧🇩: 8️⃣ ➡️ 5️⃣ #CWC19 | #WIvBAN pic.twitter.com/gkGDr5pPon
— Cricket World Cup (@cricketworldcup) June 17, 2019
అఫ్గాన్‌తో మ్యాచ్ ప్రారంభయ్యేంత వరకు మోర్గాన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మోర్గాన్ మ్యాచ్‌కు దూరమైతే వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. కరన్ లేదా మొయిన్ అలీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
న్యూజిలాండ్‌తో మినహా అన్ని మ్యాచ్‌ల్లో 40 ఓవర్ల లోపలే అఫ్గాన్ ఆలౌటైంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయి, నూర్ అలీ జర్దాన్, ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. పిచ్ పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలిస్తే రషీద్, నబీ చెలరేగే అవకాశం ఉంది.
జట్లు :
ఇంగ్లాండ్ :
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, కరన్, లియామ్ డాసన్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓక్స్, మార్క్ ఉడ్.
అఫ్గానిస్థాన్ :
గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), నూర్ అలీ జర్డాన్, హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, అస్గర్ అఫ్గాన్, హష్మతుల్లా షాహిదీ, నజీబుల్లా జర్డాన్, సమీవుల్లా షన్వారీ, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, దవ్లాత్ జర్డాన్, అఫ్తాబ్ ఆలం, హమీద్ హసన్, ముజీబుర్ రహమాన్, ఇక్రమ్ అలీ ఖిల్.
ఇదీ చూడండి: 'కెప్టెన్ మెదడు లేనోడు... అందుకే పాక్ ఓడింది'