మహేంద్రసింగ్ ధోనీ 'బలిదాన్' లోగో ఉన్న గ్లౌజ్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ గ్లౌజ్ ధరించి మ్యాచ్లు ఆడేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఒప్పుకోలేదు. మహీ ధరించింది మిలిటరీ లోగో కాదని బీసీసీఐ వాదించినా.. ఐసీసీ అంగీకరించలేదు.
"నిబంధనల ప్రకారం ఐసీసీ ఈవెంట్లలో వ్యక్తిగత, మతపరమైన, మిలిటరీ సంబంధిత లోగోలను ధరించకూడదు. ఈ ప్రపంచకప్లో ధోనీ బలిదాన్ లోగో ఉన్న గ్లౌజ్తో ఆడటాన్ని అనుమంతించం" అని ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.
దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్లో ధోనీ.. బలిదాన్ లోగో ఉన్న గ్లౌజ్తో కీపింగ్ చేశాడు. దీనిపై సర్వత్రా ప్రశంసలు అందుకున్నాడు. అయితే బలిదాన్ లోగోను ధోనీ తొలగించాలంటూ బీసీసీఐను కోరింది ఐసీసీ. ఈ అంశంపై స్పందించిన అభిమానులు మహీకి మద్దుతుగా నిలిచారు.