ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగలనుంది. ఇటీవల ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన ఓపెనర్ వార్నర్... శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ ఆడలేదు. బుధవారం మైదానంలోనూ సాధన చేయలేదు. ఫలితంగా వార్నర్ శనివారం ఆఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన కోచ్ జస్టిన్... వార్నర్ మ్యాచ్‌లో ఆడేది, లేనిది ఫిట్నెస్ బట్టి నిర్ణయిస్తామని వెల్లడించారు.
"వార్నర్‌కు కుడి తొడ భాగం వద్ద గాయమైంది. ఆ నొప్పితో వార్నర్ ఇబ్బంది పడుతున్నాడు. టోర్నీలో 15 మంది ఆటగాళ్లకు అవకాశం రావాలని వార్నర్ కోరుకుంటాడు. ప్రస్తుతం బాగానే నవ్వుతున్నాడు, ఎనర్జిటిక్‌గానే ఉన్నాడు. కానీ మైదానంలో పరిగెత్తగలడా అనే ఆలోచిస్తున్నాం. ఇది చాలా పెద్ద టోర్నమెంట్ కాబట్టి ఆటగాళ్లకు అవకాశాలు వస్తాయి. తొలి మ్యాచ్‌లో మాత్రం ఫిట్‌గా ఉంటేనే వార్నర్ తుది జట్టులో ఆడతాడు ".
-- జస్టిన్ లంగర్, ఆస్ట్రేలియా జట్టు కోచ్
శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వార్నర్ తుదిజట్టులో ఆడకపోవడం వల్ల ఉస్మాన్ ఖవాజా, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. శనివారం ఆటకు వార్నర్ ఫిట్‌గా లేకపోతే ఖవాజా, షాన్ మార్ష్ మ్యాచ్ ఆడనున్నట్లు లంగర్ వెల్లడించారు.
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న వార్నర్.. ఐపీఎల్‌తో పునరాగమనంలోనే అద్భుతంగా రాణించాడు.
ఇవీ చూడండి..