ETV Bharat / sports

టీమిండియా 2.0: ఊహించని రీతిలో.. వికెట్ల వేటలో - shami

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్​లో కోహ్లీసేన అజేయంగా దూసుకుపోతోంది. మొత్తం 6 మ్యాచులాడిన భారత్​ 5 మ్యాచుల్లో నెగ్గి 11 పాయింట్లతో ఆసీస్​ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. భారత బౌలింగ్​ దళం ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్​మెన్​కు కొరకరాని కొయ్యగా మారుతోంది. క్రీజులో ఎవరున్నా తమదైన శైలిలో రెచ్చిపోతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

బుమ్రా
author img

By

Published : Jun 30, 2019, 7:01 AM IST

Updated : Jun 30, 2019, 9:23 AM IST

ప్రపంచకప్​, ఆసియాకప్​, ముక్కోణపు సిరీస్​ ఇలా టోర్నీ ఏదైనా.. భారత జట్టు అనగానే అందరికీ గుర్తొచ్చేది పటిష్ఠమైన బ్యాటింగ్​ లైనప్​... నిజానికి ఎప్పటి నుంచో మన జట్టు బలం కూడా అదే. బౌలింగ్ ఎలా ఉన్నా... అద్భుత బ్యాటింగ్​ ప్రదర్శనతో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సాధించింది మెన్​ ఇన్​ బ్లూ. సునీల్​ గావాస్కర్​ నుంచి సచిన్​ తెందుల్కర్​, లక్ష్మణ్​, ద్రవిడ్​, సెహ్వాగ్​, గంభీర్​, యువరాజ్ దాకా ప్రతి ఒక్కరు తమ బ్యాటింగ్​ నైపుణ్యంతోనే జట్టుకు ఎన్నో అపూర్వ విజయాలు అందించారు. 2011 ప్రపంచకప్​లోనూ భారత్​.. బ్యాటింగ్​తోనే కప్పు నెగ్గిందనడంలో సందేహమే లేదు.

MATCH
ఇండియన్ టీమ్

అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్​ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్​ మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది.​ కోహ్లి, రోహిత్​, ధావన్​, ధోని, పాండ్యా, రాహుల్​, జాదవ్​తో కూడిన దుర్భేధ్యమైన బ్యాటింగ్ బృందం ప్రత్యర్థిని భయపెడుతుందని భావించారు అంతా..! వారి ప్రదర్శన ఎలా ఉన్నా... భారత బౌలింగ్​ దళం మాత్రం ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. డెత్​ ఓవర్ల స్పెషలిస్ట్​ బుమ్రాతో పాటు షమీ, భువనేశ్వర్​, చాహల్​, కుల్దీప్​ యాదవ్​లు టోర్నీ ఆసాంతం అదరగొడుతున్నారు. పిచ్ ఏదైనా.. బ్యాట్స్​మెన్​ ఎవరైనా.. లక్ష్యం ఎంత చిన్నదైనా... ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ తామున్నామనే భరోసాను నింపుతున్నారు.

దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్​ నుంచి మొదలుపెడితే మొన్న జరిగిన విండీస్​ మ్యాచ్ వరకు జట్టు విజయంలో బౌలర్లే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్​తో చివరివరకు అలుపెరుగని పోరాటం చేసి జట్టుకు విజయాన్నందించారు. దక్షిణాఫ్రికా, విండీస్​, దాయాది పాకిస్థాన్​తో జరిగిన పోరులోనూ తమదైన ముద్రవేసి జట్టును అజేయంగా నిలిపారు. ముఖ్యంగా బుమ్రా.. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​కు కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. ఇక ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​లోనూ తనస్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

MATCH
బుమ్రా

ఆసీస్​ మాత్రమే..

ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు భారత్​ 6 మ్యాచ్​లు ఆడింది. అందులో న్యూజిలాండ్​తో జరగాల్సిన మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. మిగతా 5 మ్యాచ్​ల్లో కేవలం ఆస్ట్రేలియా(316/10) మాత్రమే కోహ్లీసేనపై 300 పైచిలుకు పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా (227/9), పాకిస్థాన్​ (212/6), అఫ్గానిస్థాన్​ (213/10), వెస్టిండీస్​ (143/10) జట్లను 250లోపు స్కోరుకే నిలువరించగలిగారు మన బౌలర్లు. ఈ ఐదు మ్యాచుల్లో కలిపి భారత బౌలింగ్ బృందం 43 వికెట్లు తీసింది. ఇందులో బుమ్రా (9), భువనేశ్వర్​ (5), షమీ (8), కుల్దీప్​ యాదవ్​ (4), చాహల్​ (10), పాండ్యా (5), విజయ్​ శంకర్​ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

షమి వచ్చాడు.. హ్యాట్రిక్​ తీశాడు

MATCH
షమీ

పాక్​తో పోరులో గాయం కారణంగా మ్యాచ్​ మధ్యలోనే వెనుదిరిగాడు ప్రధాన పేసర్​ భువనేశ్వర్​. భువి స్థానంలో జట్టులోకి వచ్చిన షమి... ప్రపంచకప్​లో అఫ్గాన్​తో మ్యాచ్​లో బరిలోకి దిగి హ్యాట్రిక్​తో అదరగొట్టాడు. భారత్​ తరఫున మెగాటోర్నీలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్​గా రికార్డు సృష్టించాడు. అంతే కాదు పసికూన అఫ్గాన్​ చేతిలో ఓడిపోయే ప్రమాదం నుంచి జట్టును గట్టెక్కించాడు. ఆ తర్వాత విండీస్​తో జరిగిన మ్యాచ్​లోనూ విజృంభించిన ఈ పేసర్​ ఏకంగా 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుని రెండు మ్యాచుల్లోనే 8 వికెట్లను పడగొట్టాడు. తాజాగా భువీ కూడా గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్​ తదుపరి సమరానికి సిద్ధమవడం కోహ్లీసేనకు శుభపరిణామమే..

ఇంతవరకు నో సెంచరీ...

ప్రస్తుత ప్రపంచకప్​లో ఓటమి ఎరుగని జట్టు భారతే... అంతేకాదు కోహ్లీసేనపై ఈ ప్రపంచకప్​లో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్​మెన్​ ఎవరూ సెంచరీ చేయలేదంటే మన బౌలింగ్​ ఎంత పదునెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు భారత్​పై కేవలం 5 అర్ధసెంచరీలు (నబీ(52), ఫకర్ జమాన్​(62), డేవిడ్​ వార్నర్​(56), స్టీవ్ స్మిత్​(69), అలెక్స్ కారీ(55)) మాత్రమే నమోదయ్యాయి.

బ్యాట్స్​మెన్​ తక్కువేం కాదు...

బౌలర్లు రాణిస్తున్నారని బ్యాట్స్​మెన్​ను తక్కువ చేయలేం. రోహిత్​, కోహ్లి, ధోని, పాండ్యా, రాహుల్​ తమస్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్​లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్​ రోహిత్ శర్మ​ జట్టును పరాజయం నుంచి రక్షించాడు. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లోనూ 140 పరుగులతో కదంతొక్కాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​గా నిలిచాడు. మొత్తం 5 ఇన్నింగ్స్​ల్లో 338 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన వారిలో జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు హిట్​మ్యాన్​.

MATCH
భారత బ్యాట్స్​మెన్

మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో చెలరేగి ఆడి సెంచరీ నమోదు చేశాడు. అదే మ్యాచ్​లో ఎడమ చేతి బొటనవేలుకు గాయం కారణంగా దురదృష్టవశాత్తూ ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు.

కోహ్లీ క్లాస్​... ధోని మెరుపులు

ఇక కెప్టెన్​ కోహ్లీ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో మినహా వరుసగా నాలుగు మ్యాచుల్లో అర్ధశతకాలు సాధించిన భారత కెప్టెన్​ మొత్తం 5 ఇన్నింగ్స్​ల్లో 84.50 సగటుతో 316 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

చివరి ఓవర్లలో ధోని, పాండ్యాలు మెరుపులు మెరిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ధావన్​ను గాయంతో జట్టులో చోటు సంపాదించుకున్న విజయ్​ శంకర్​ మాత్రం ఆశించినమేర రాణించలేకపోతున్నాడు.

ఏదేమైనా ఈ మెగాటోర్నీలో మన బౌలింగ్​ దళం ఇలాగే రెచ్చిపోయి.. మరోసారి భారత్​ ప్రపంచకప్​ను ముద్దాడాలని కోరుకుందాం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE:
DURATION:
STORYLINE:
Last Updated : Jun 30, 2019, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.