ప్రపంచకప్ సమరం తుది అంకానికి చేరుకుంది. పది జట్లతో ఆరంభమైన ఈ పోరులో నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మంగళవారం జరిగే తొలి సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి సమస్య ఎదురుకానుంది.
ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా మిడిల్ ఆర్డర్ పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటీకి టాపార్డర్ రాణించింది. రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో సెమీస్ వరకు చేరింది భారత్. అయితే సెమీస్‌లో బౌల్ట్ సమస్యగా మారనున్నాడు. ముఖ్యంగా కొత్త బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మెగాటోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన కివీస్ పేసర్ 15 వికెట్లు తీశాడు.
ఓపెనర్లను త్వరగా పెవిలియన్ చేర్చడంలో బౌల్ట్ దిట్ట. అందులోనూ భారత్‌పై మంచి రికార్డు ఉంది. ఈ ఏడాది భారత్‌తో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3.92 సగటుతో 12 వికెట్లు తీశాడు. ఈ మెగాటోర్నీలో 5 శతకాలతో ఆకట్టుకున్న రోహిత్ తన కెరీర్లో బౌల్ట్ బౌలింగ్‌లోనే నాలుగు సార్లు ఔటయ్యాడు. భారత్ ఆడిన వార్మప్ మ్యాచ్‌లోనూ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. ఫలితంగా టీమిండియా 179పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్, శిఖర్ ధావన్, కే ఎల్ రాహుల్ వికెట్లు పడగొట్టాడు బౌల్ట్.
ఇప్పటికే ఆసీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో విజృంభించాడు. 2015, 2019 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో 37 వికెట్లతో బౌల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు 48 వికెట్లతో స్టార్క్ తొలి స్థానంలో ఉన్నాడు.
ఆటగాడు | మ్యాచ్‌లు | వికెట్లు | సగటు |
మిషెల్ స్టార్క్(ఆసీస్) | 17 | 48 | 13.66 |
ట్రెంట్ బౌల్ట్(కివీస్) | 17 | 37 | 20.02 |
షమీ(భారత్) | 11 | 31 | 15.70 |
వహాబ్ రియాజ్(పాకిస్థాన్) | 15 | 27 | 28.44 |
ఇమ్రాన్ తాహిర్(దక్షిణాఫ్రికా) | 17 | 26 | 26.80 |
ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో బౌల్ట్ అందరికంటే ముందున్నాడు. 18 మ్యాచ్‌ల్లో 22.27 సగటుతో 36 వికెట్లు తీశాడు.
ఆటగాడు | మ్యాచ్‌లు | వికెట్లు | సగటు |
ట్రెంట్ బౌల్ట్(కివీస్) | 18 | 36 | 22.27 |
షమీ(భారత్) | 15 | 33 | 21.06 |
ఫెర్గ్యూసన్(కివీస్) | 15 | 31 | 23.77 |
కమిన్స్ (ఆసీస్) | 15 | 30 | 21.20 |
ముస్తాఫిజుర్ రెహమాన్(బంగ్లాదేశ్) | 14 | 30 | 27.73 |
ఇది చదవండి: WC19: కివీస్‌తో పోరుకు భారత్ ఇస్మార్ట్ ప్లాన్