ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఈ పోరులో 263 పరుగుల లక్ష్యంతో దిగిన అఫ్గాన్ జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. 5 వికెట్లు పడగొట్టిన షకిబ్... బంగ్లా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తాజా విజయంతో మొత్తం 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది బంగ్లా.
-
Bangladesh Win 🙌 Tigers seal their third victory in #CWC19 with a 62-run win against Afghanistan at Southampton 👏#BANvAFG #RiseOfTheTigers #KhelbeTigerJitbeTiger pic.twitter.com/xOKNXKUsO1
— Bangladesh Cricket (@BCBtigers) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bangladesh Win 🙌 Tigers seal their third victory in #CWC19 with a 62-run win against Afghanistan at Southampton 👏#BANvAFG #RiseOfTheTigers #KhelbeTigerJitbeTiger pic.twitter.com/xOKNXKUsO1
— Bangladesh Cricket (@BCBtigers) June 24, 2019Bangladesh Win 🙌 Tigers seal their third victory in #CWC19 with a 62-run win against Afghanistan at Southampton 👏#BANvAFG #RiseOfTheTigers #KhelbeTigerJitbeTiger pic.twitter.com/xOKNXKUsO1
— Bangladesh Cricket (@BCBtigers) June 24, 2019
టైటిల్ ఫేవరెట్లుగా బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగిన జట్లు ఓ పక్క ఇంటిముఖం పడుతుంటే... పసికూనగా, అంతంత మాత్రం అంచనాలతో బరిలోకి దిగిన బంగ్లా సెమీస్ పోరులో నిలిచింది. ప్రత్యర్థి అఫ్గాన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అని విభాగాల్లోనూ చక్కటి ప్రదర్శన చేసింది.
- తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. బంగ్లా కీపర్ ముష్ఫికర్ రహీమ్ (83), షకిబ్ ఉల్ హసన్ (51) సత్తా చాటారు. అఫ్గాన్ బౌలర్లలో ముజిబ్ రహ్మాన్ 3, నయీబ్ 2 వికెట్లతో రాణించారు.
- షిన్వారీ ఒంటరి పోరాటం..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లుగా వచ్చిన అఫ్గాన్ సారథి గుల్బాదిన్ నయీబ్ 47 పరుగులు(75 బంతుల్లో; 3 ఫోర్లు), రహ్మత్ షా 24 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాని కీలక సమయంలో గుల్బాదిన్, హస్మతుల్లా (11), ఆస్గర్ (20) ఔటయ్యారు. భారత్ మ్యాచ్‌లో సత్తా చాటిన నబీ.. షకిబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా షిన్వారీ 49 పరుగులు (51 బంతుల్లో ; 3ఫోర్లు, ఒక సిక్సర్) సాధించి చివరి వరకు క్రీజులో నిలిచాడు. నజీబుల్లా (23) చివర్లో కొంత సహకారం అందించినా ఫలితం దక్కలేదు.
-
Congratulations to #GulbadinNaib for becoming the 10th Afghan batsman to pass 1,000 ODI runs 👏 👏 pic.twitter.com/4vGUhrkvOX
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to #GulbadinNaib for becoming the 10th Afghan batsman to pass 1,000 ODI runs 👏 👏 pic.twitter.com/4vGUhrkvOX
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019Congratulations to #GulbadinNaib for becoming the 10th Afghan batsman to pass 1,000 ODI runs 👏 👏 pic.twitter.com/4vGUhrkvOX
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
షకిబ్ ఆల్‌రౌండర్ ప్రదర్శన...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లా. ఓపెనర్ లిటన్ దాస్ (16) త్వరగా ఔటైనా... తమీమ్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ ఉల్ హసన్ (51)విలువైన ఇన్నింగ్స్ ఆడారు. తమీమ్‌తో కలిసి రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు షకిబ్. ఈ ప్రపంచకప్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అయిదో అర్ధశతకం తన ఖాతాలో వేసుకొని టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు షకిబ్.
బౌలింగ్‌లోనూ రాణించిన షకిబ్ 10 ఓవర్లు వేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు సాధించాడు. ఆల్‌రౌండర్‌గా రాణించి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు.
బంగ్లా బ్యాటింగ్‌లో ముష్ఫికర్ రహీమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 87 బంతుల్లో 83 పరుగులతో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొసాద్దిక్ (35 నాటౌట్) చివర్లో బ్యాట్ ఝుళిపించడం వల్ల 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగుల స్కోరు సాధించింది బంగ్లా.
అఫ్గాన్ బౌలర్లలో ముజిబ్ రహ్మాన్ 3, నయీబ్ 2 వికెట్లతో రాణించారు. నబీ, జద్రాన్‌కు తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
-
Bangladesh win for the third time in #CWC19!
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Not for the first time this tournament, Shakib Al Hasan is their star man 🌟 #CWC19 | #BANvAFG | #RiseOfTheTigers pic.twitter.com/qGULklaNj3
">Bangladesh win for the third time in #CWC19!
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
Not for the first time this tournament, Shakib Al Hasan is their star man 🌟 #CWC19 | #BANvAFG | #RiseOfTheTigers pic.twitter.com/qGULklaNj3Bangladesh win for the third time in #CWC19!
— Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
Not for the first time this tournament, Shakib Al Hasan is their star man 🌟 #CWC19 | #BANvAFG | #RiseOfTheTigers pic.twitter.com/qGULklaNj3
రికార్డులు...
- ప్రపంచకప్‌లో బంగ్లా తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నెలకొల్పాడు షకిబ్. 29 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
- మెగాటోర్నీలో అత్యుత్తమ స్పిన్నర్ల జాబితాలో 6వ స్థానం సంపాదించాడు షకిబ్.
- వన్డేల్లో 5/29 ప్రదర్శనతో సత్తా చాటిన రెండో బంగ్లా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
- వన్డేల్లో వ్యక్తిగతంగానూ షకిబ్‌కు ఇదే అత్యుత్తమం. గతంలో జింబాబ్వేపై 5/47 అత్యుత్తమం సాధించాడు.
- ప్రపంచకప్ కెరీర్లో 1000 పరుగుల పూర్తి చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా షకిబ్ రికార్డులకెక్కాడు.
- మొత్తంగా ఈ మార్కు అందుకున్న వారిలో 19వ ఆటగాడు షకిబ్.
- ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న వార్నర్‌ను వెనక్కి నెట్టాడు షకిబ్(476).
- మెహిదీ హసన్,గుల్బాదిన్ వన్డేల్లో వేయి పరుగులు పూర్తి చేసుకున్నారు.