వర్షం కారణంగా బంగ్లా-శ్రీలంక మ్యాచ్ రద్దు
ప్రపంచకప్లో వరుసగా రెండో మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బ్రిస్టల్ వేదికగా జరగాల్సిన శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ టాస్ వేయకుండానే రద్దయింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అంప్లెర్లు. రద్దు కారణంగా రెండు జట్లకు చెరో పాయింటు లభించింది. శ్రీలంక 4 మ్యాచ్లలో 4 పాయింట్లు, బంగ్లాదేశ్ 4 మ్యాచ్లలో 3 పాయింట్లతో ఉన్నాయి.
సోమవారం(జూన్ 10న).. సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంతో రద్దయింది.