ఇప్పటిలా భారత్ 1983 వరల్డ్‌కప్ ఫేవరెట్కాదు. అప్పుడు టీమిండియా ఓ చిన్న జట్టు.. ఎలాంటి అంచనాలు లేవు.. లీగ్ దశ దాటితే చాలనుకున్నారు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. రెండు సార్లు విశ్వవిజేత విండీస్‌ను ఫైనల్లో ఓడించి తొలిసారి ఛాంపియన్ అయింది భారత్. సరిగా 36 ఏళ్ల క్రితం ఇదే రోజు(జూన్ 25)న కపిల్‌దేవ్ సారథ్యంలో వరల్డ్‌కప్‌ను ముద్దాడింది టీమిండియా.
-
On this day in 1983 - India won the World Cup and held the trophy high at Lord's - Memories to last a lifetime 🇮🇳🇮🇳🏆🏆 pic.twitter.com/w6b7gg7zAw
— BCCI (@BCCI) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">On this day in 1983 - India won the World Cup and held the trophy high at Lord's - Memories to last a lifetime 🇮🇳🇮🇳🏆🏆 pic.twitter.com/w6b7gg7zAw
— BCCI (@BCCI) June 24, 2019On this day in 1983 - India won the World Cup and held the trophy high at Lord's - Memories to last a lifetime 🇮🇳🇮🇳🏆🏆 pic.twitter.com/w6b7gg7zAw
— BCCI (@BCCI) June 24, 2019
ఆ ప్రపంచకప్‌లో ఒక్కో జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడింది ప్రతీ టీమ్. 60 ఓవర్ల ఆట. తొలి రెండు మ్యాచ్‌లు వెస్టిండీస్, జింబాబ్వేపై గెలిచింది భారత్. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో 162 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్‌తో రెండోసారి జరిగిన మ్యాచ్‌లో పరాజయం చెందింది. తర్వాత ఆస్ట్రేలియా, జింబాబ్వేపై నెగ్గి సెమీస్‌కు దూసుకెళ్లింది భారత్.
కపిల్ అద్భుత ఇన్నింగ్స్..
ముఖ్యంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్న భారత్‌ను కపిల్‌దేవ్ ఆదుకున్నాడు. 138 బంతుల్లో 175 పరుగులతో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా టీమిండియా 31 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం సెమీస్‌లో ప్రమాదకర ఇంగ్లాండ్‌ను 6 వికెట్లు తేడాతో ఓడించింది భారత్.
విండీస్‌తో తుదిపోరు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కృష్ణమాచారి శ్రీకాంత్(38) ఒక్కడే టాప్ స్కోరర్.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 పరుగులకు ఒక్క వికెట్ కోల్పోయి మంచి స్థితిలో ఉంది. ప్రమాదకర వివ్ రిచర్డ్స్(33) క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు భారత బౌలర్ మదన్‌లాల్. రిచర్డ్స్‌ను ఔట్ చేసి విండీస్‌ను దెబ్బతీశాడు. అనంతరం కరీబియన్ ఆటగాళ్లు ఒక్కోక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. 52 ఓవర్లలో 140 పరుగుల వద్ద విండీస్ ఆలౌటైంది. భారత్ తొలిసారి విశ్వవిజేతైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మూడోసారి ముచ్చట తీరుస్తారా..?
36 ఏళ్ల క్రితం తొలిసారి ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత్ అనంతరం 2011లో ధోనీ సారథ్యంలో రెండోసారి ముద్దాడింది. ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలో 2019 వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగింది టీమిండియా. ఈ టోర్నీలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న భారత్ ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కోరిక తీర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, సాతాఫ్రికా, పాకిస్థాన్ లాంటి జట్లను ఓడించింది టీమిండియా.
1983 మధుర క్షణాలను భారతీయులకు మరోసారి చూపించేందుకు బాలీవుడ్లో '83' సినిమా రాబోతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కపిల్‌దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. దీపికా పదుకునే కీలకపాత్ర పోషిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.