జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆశించిన పాకిస్థాన్‌కు ఆఖరి వన్డేలో చుక్కెదురైంది. మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నెగ్గింది జింబాబ్వే. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (118) సెంచరీ చేశాడు. హస్నైన్ (5/26) సత్తా చాటాడు. ఛేదనలో ముజరంబాని (5/49) దెబ్బకు పాక్ 88 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ అజామ్ (125), రియాజ్ (52) రాణించడం వల్ల పాక్ 46 ఓవర్లలో 247/6తో విజయానికి చేరువైంది.
కానీ, చివర్లో పాక్ తడబడటం వల్ల స్కోర్లు సమమయ్యాయి. సూపర్ ఓవర్లో పాక్ 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. జింబాబ్వే వికెట్ కోల్పోకుండా మూడు బంతుల్లో లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఒక మ్యాచ్‌లో రెండు సెంచరీలు, రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదైన తొలి వన్డే ఇదే.
ఇదీ చూడండి:టీవీలోనూ క్రికెట్ చూడని అమ్మాయి.. మినీ ఐపీఎల్లో