ETV Bharat / sports

క్రికెట్​లో కొత్త ఫార్మాట్​.. బరిలో యువీ, గేల్​​

టీ20, టీ10, ది హండ్రెడ్​ వంటి వినూత్న ఫార్మాట్ల తర్వాత క్రికెట్​లో మరో కొత్త రకమైన గేమ్​ క్రికెట్​ ప్రేమికులకు పరిచయం కానుంది. అల్టిమేట్​ క్రికెట్​ ఛాలెంజ్ అనే పేరుతో ఓ కొత్త రకమైన క్రికెట్​ ఫార్మాట్​కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ లీగ్​ డిసెంబరు 24న ప్రారంభమై.. జనవరి 1 వరకు జరగనుంది. ఈ లీగ్​లో టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్ భాగం కానున్నాడు.

Yuvraj Singh to take part in 'Ultimate Kricket Challenge'
క్రికెట్​లో కొత్త ఫార్మాట్​.. బరిలో యువరాజ్​సింగ్​
author img

By

Published : Dec 16, 2020, 5:32 AM IST

క్రికెట్​ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో మార్పులను సంతరించుకుంది. పది రోజుల క్రికెట్ నుంచి ఐదు రోజుల టెస్టుల వరకు.. వన్డేల నుంచి (టీ20) పొట్టి ఫార్మాట్​ వరకు రూపాంతరం పొందుతూ వచ్చింది. ఇటీవలే టీ10, ది హండ్రెడ్​ లీగ్​ వంటి వినూత్న ఫార్మాట్​లతో క్రీడాప్రేమికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఇదే నేపథ్యంలో ఈ జెంటిల్​మెన్​ గేమ్​లో మరో కొత్త విధానం రానుంది. క్రికెట్​ చరిత్రలో ఇప్పటివరకు చూడని కొత్త ఫార్మాట్​ అది. దీని పేరు అల్టిమేట్​ క్రికెట్​ ఛాలెంజ్​. ప్రపంచ క్రికెట్​లోని ఆరుగురు ఆటగాళ్లతో ఈ లీగ్​ జరగనుంది. డిసెంబరు 24 నుంచి జనవరి 1వరకు జరగనుంది.

Yuvraj Singh to take part in 'Ultimate Kricket Challenge'
అల్టిమేట్​ క్రికెట్​లో భాగం కానున్న క్రికెటర్లు

ఆ ఆరుగురు క్రికెటర్లు!

అల్టిమేట్​ క్రికెట్​ ఛాలెంజ్​లో దిగ్గజ క్రికెటర్లైన యువరాజ్​ సింగ్​, ఇయాన్​ మోర్గాన్, కెవిన్​ పీటర్సన్​(ఇంగ్లాండ్​)​, ఆండ్రీ రస్సెల్​​, క్రిస్​ గేల్(వెస్టిండీస్​)​, రషీద్​ ఖాన్(అఫ్గానిస్థాన్​)​ పాల్గొననున్నారు. ఇందులోని ప్రతి ఒక్క ఆటగాడు మిగిలిన ఆటగాళ్లతో పోటీ పడాల్సి ఉంటుంది.

ఎలా ఆడాలి?

ఒక గేమ్​లో నాలుగు ఇన్నింగ్స్​ ఉంటాయి. ఒక్కో ఇన్నింగ్స్​లో 15 బంతులు వేయాలి. అలా ఒక్కో ఆటగాడు 30 బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లీగ్​లో మొత్తం 16 మ్యాచ్​లు ఉంటాయి. ఒక్కో మ్యాచ్​లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఆడతారు. ఇందులో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. గెలిచిన క్రికెటర్​కు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. లీగ్​ దశలో అత్యధిక పరుగులు చేసిన టాప్​-4 ఆటగాళ్లు సెమీఫైనల్​కు చేరుతారు.

పరుగులు రాబట్టడం ఎలా?

ఆరు జోన్లుగా డివైడ్​ చేసి జోన్​ ఎ - 1 రన్, జోన్​ బీ - 1 రన్, జోన్​ సీ - 2 రన్స్​, జోన్​ డీ - 3 రన్స్​, జోన్​ ఈ - బౌన్స్​తో వెళితే ఫోర్​ రన్స్​, జోన్​ ఈ - నేరుగా వెళితే సిక్సర్​.. బ్యాట్స్​మన్​ కొట్టిన షాట్​కు బౌలర్​ వెనకున్న బుల్స్​ ఐని తాకితే 12 రన్స్​ వస్తాయి. దీంతో పాటు ఒక బాల్​ అదనంగా లభిస్తుంది. వికెట్లకు స్క్వేర్​గా ఉండే బుల్స్​ ఐని కొడితే 4 పరుగులు రాబట్టవచ్చు. బ్యాట్స్​మన్​ ఔటైతే వారు చేసిన రన్స్​ నుంచి 5 పరుగులను కోత విధిస్తారు. ​​

డిసెంబరు 24 నుంచి రాత్రి 9.30 గంటలకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. జనవరి 1న జరిగే ఫైనల్​ ద్వారా ఉత్తమ క్రికెటర్​ ఎవరో తేలుతుంది.

ఇదీ చూడండి: దేశవాళీ క్రికెట్​తో యువీ, శ్రీశాంత్​ రీఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.