యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదని ట్వీట్ చేశాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయభ్ అక్తర్. బౌన్సర్ తగిలి స్మిత్ బాధపడుతుంటే ఆర్చర్ ఏమి పట్టనంటూ వెళ్లిపోయాడని పోస్ట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు.
"బౌలర్ బౌన్సర్ వేయడం.. బంతి బ్యాట్స్‌మన్‌కు తగలడం ఇవన్నీ ఆటలో భాగం. కానీ జోఫ్రా ఆర్చర్ ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. స్మిత్ బంతి తగిలి కిందపడినపుడు ఎలా ఉందని అడగకుండా ఏమి పట్టనట్టు వెళ్లిపోయాడు. నేనైతే అలా చేసే వాడిని కాదు" -షోయబ్ అక్తర్, పాక్ మాజీ ఆటగాడు.
-
Bouncers are a part & parcel of the game but whenever a bowler hits a batsman on the head and he falls, courtesy requires that the bowler must go & check on him. It was not nice of Archer to just walk away while Smith was in pain. I was always the first one to run to the batsman.
— Shoaib Akhtar (@shoaib100mph) August 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bouncers are a part & parcel of the game but whenever a bowler hits a batsman on the head and he falls, courtesy requires that the bowler must go & check on him. It was not nice of Archer to just walk away while Smith was in pain. I was always the first one to run to the batsman.
— Shoaib Akhtar (@shoaib100mph) August 18, 2019Bouncers are a part & parcel of the game but whenever a bowler hits a batsman on the head and he falls, courtesy requires that the bowler must go & check on him. It was not nice of Archer to just walk away while Smith was in pain. I was always the first one to run to the batsman.
— Shoaib Akhtar (@shoaib100mph) August 18, 2019
అక్తర్ ట్వీట్‌కు యువరాజ్ సింగ్ స్పందించాడు.
"అవును నిజమే ముందు నువ్వే వెళ్లి అడిగేవాడివి. ఇలాంటివి(బౌన్సర్లు) మరిన్ని వస్తాయి.. కాచుకోమని చెప్పేవాడివి" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్.
-
Yes you did ! But your actual words were hope your alright mate cause there are a few more coming 🤣🤣🤣🤣🤪
— yuvraj singh (@YUVSTRONG12) August 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yes you did ! But your actual words were hope your alright mate cause there are a few more coming 🤣🤣🤣🤣🤪
— yuvraj singh (@YUVSTRONG12) August 19, 2019Yes you did ! But your actual words were hope your alright mate cause there are a few more coming 🤣🤣🤣🤣🤪
— yuvraj singh (@YUVSTRONG12) August 19, 2019
శనివారం జరిగిన నాలుగో రోజు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గంటకు 148 కిలో మీటర్ల వేగంతో బంతిని వేశాడు. బ్యాటింగ్ చేస్తోన్న స్మిత్ తలకి బంతి తగిలింది. కింద పడిపోయిన ఆసీస్ ఆటగాడిని పలకరించకుండా ఆర్చర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రెండో టెస్టు డ్రాగా ముగిసింది.
ఇది చదవండి: ఆర్చర్ తీరుపై షోయబ్ అక్తర్ మండిపాటు