క్రికెట్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడితే ఆ మజా వేరు. ఇరుజట్లు పోటీపడితే రెండు దేశాల ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఇక మైదానంలో బరిలోకి దిగిన ఆటగాళ్లయితే చెప్పక్కరలేదు. చావోరేవో అన్నట్లు పోరాడతారు. మరి ఇలాంటి మ్యాచ్‌లు దాదాపు చాలా ఏళ్లుగా జరగట్లేదు. ఐసీసీ టోర్నీలో ఎప్పుడో ఒకటో, రెండో మ్యాచ్‌లు మినహాయిస్తే ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లే లేవు. తాజాగా ఇరుదేశాల క్రికెట్‌పై మాట్లాడాడు టీమిండియా యువ క్రికెటర్ యువరాజ్ సింగ్. భారత్-పాక్ మ్యాచ్‌లు క్రికెట్‌కు మేలుచేస్తాయని యువీ అభిప్రాయపడ్డాడు.
-
Really enjoyed experience at @iccacademy with @yuvisoffical 👊 was really inspired seeing such motivated and talented young cricketers around #LalavsYuvi #Cricket4Good pic.twitter.com/LcFEOK96HT
— Shahid Afridi (@SAfridiOfficial) February 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Really enjoyed experience at @iccacademy with @yuvisoffical 👊 was really inspired seeing such motivated and talented young cricketers around #LalavsYuvi #Cricket4Good pic.twitter.com/LcFEOK96HT
— Shahid Afridi (@SAfridiOfficial) February 11, 2020Really enjoyed experience at @iccacademy with @yuvisoffical 👊 was really inspired seeing such motivated and talented young cricketers around #LalavsYuvi #Cricket4Good pic.twitter.com/LcFEOK96HT
— Shahid Afridi (@SAfridiOfficial) February 11, 2020
"పాకిస్థాన్‌తో 2004, 2006, 2008లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం నాకిప్పటికీ గుర్తుంది. ప్రస్తుతం రెండు జట్ల మధ్య సిరీస్ అన్నదే లేదు. ఆటపై ప్రేమతో మేం ఆడతాం. ఎవరితో ఆడాలో ఎంచుకునే అవకాశం మాకు లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎంత ఎక్కువ జరిగితే.. క్రికెట్‌కు అంత మంచిది"
- యువరాజ్, టీమిండియా మాజీ ఆటగాడు
ఇటీవలే దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీని పాకిస్థాన్ ఆటగాడు అఫ్రిదితో కలిసిసందర్శించాడు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై యువీ మాటలను సమర్థించాడు అఫ్రిది. ఇరు దేశాలు కలిసి సిరీస్ ఆడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరాడు.ట
భారత్, పాకిస్థాన్ చివరగా 2008లో ద్వైపాక్షిక టెస్టు సిరీస్ ఆడాయి. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల ఈ మ్యాచ్‌లు జరగట్లేదు.
ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన 'బుష్ఫైర్ క్రికెట్ బాష్'లో పాల్గొన్నాడు యువరాజ్. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఛారిటీ మ్యాచ్ జరిగింది. ఇందులో రికీ పాంటింగ్, గిల్‌క్రిస్ట్ జట్లు తలపడ్డాయి. గిలిక్రిస్ట్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు యువీ.
ఇదీ చూడండి.. బుష్ఫైర్ బాష్: గిల్‌క్రిస్ట్ జట్టుపై పాంటింగ్ సేన విజయం