భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తన బౌలింగ్ శైలితో ఎంతోమంది అభిమానులను సంపాందించుకున్నాడు. అందరికంటే ఇతడు బౌలింగ్ కాస్త భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. వేగం, కచ్చితత్వంతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేసే ఈ బౌలింగ్ విధానంపై చిన్నారులూ మక్కువ పెంచుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌లో ఓ పిల్లాడు.. బుమ్రా శైలిని అనుసరిస్తూ కనిపించాడు.
ఈ వీడియోను న్యూజిలాండ్‌లోని ఒల్లి ప్రింగిల్ అనే కోచ్.. ట్విట్టర్లో పంచుకున్నాడు. కివీస్ మాజీ కోచ్ మైక్ హెసన్ దీనిని రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం నెటిజన్లు ఆ పిల్లాడిని చూసి అచ్చం బుమ్రా లాగే బౌలింగ్ చేస్తున్నాడంటూ మెచ్చుకుంటున్నారు.
-
How good is this kids impersonation of @Jaspritbumrah93 in Auckland. @BCCI @BLACKCAPS #woweee pic.twitter.com/0XDtSEqWaW
— Ollie Pringle (@OlliePringle63) February 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">How good is this kids impersonation of @Jaspritbumrah93 in Auckland. @BCCI @BLACKCAPS #woweee pic.twitter.com/0XDtSEqWaW
— Ollie Pringle (@OlliePringle63) February 7, 2020How good is this kids impersonation of @Jaspritbumrah93 in Auckland. @BCCI @BLACKCAPS #woweee pic.twitter.com/0XDtSEqWaW
— Ollie Pringle (@OlliePringle63) February 7, 2020
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బుమ్రా... ఆ జట్టుతో జరిగిన టీ20 సిరీస్, రెండు వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఐదో టీ20లో మాత్రమే ఆకట్టుకున్నాడు. ఈరోజు(శనివారం) జరిగిన రెండో వన్డేలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 10 ఓవర్లు వేసి, 64 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇవీ చూడండి.. కింగ్ కోహ్లీ వన్డే కెరీర్లో ఇదే చెత్త రికార్డ్!