టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ.. శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం దూరంగా ఉన్నాడు. ఆ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతేడాది ప్రపంచకప్ సమయంలో తన కుటుంబం గురించి వచ్చిన వార్తలపై స్పందించాడు. ప్రతి విషయంలోకి వారిని లాగడం మంచి పద్ధతి కాదని అన్నాడు.
"మా కుటుంబాలు మాకు అండగా ఉంటాయి. మమ్మల్ని సంతోషంగా ఉంచే క్రమంలో వారు మాతో ఉంటే తప్పేంటి? ప్రపంచకప్ సమయంలో.. మా కుటుంబ సభ్యులు నిర్ణయించిన రోజుల కంటే ఎక్కువ ఉన్నారని రాశారు. ఇక్కడ వారి గురించి ఎందుకు? ఒక్క విషయం చెప్పాలనుకున్నా. నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే, అది నాకే పరిమితం చేయండి. విరాట్ కోహ్లీ ఇదే విషయం గురించి మాట్లాడాడు. కుటుంబాలు మా జీవితంలో చాలా ముఖ్యమైనవని గుర్తుంచుకోవాలి" -రోహిత్ శర్మ, భారత క్రికెటర్
గతేడాది ఓపెనర్‌గా రికార్డు సాధించాడు రోహిత్‌శర్మ. ఓ క్యాలెండర్ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో(అన్ని ఫార్మాట్లు కలిపి)అత్యధిక పరుగులు(2442) చేసిన ఘనత సొంతం చేసుకున్నాడు. 22 ఏళ్ల నుంచి ఉన్న శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.
ఇది చదవండి: 'రోహిత్ శర్మ' బ్యాట్ అద్భుతం చేసింది