ETV Bharat / sports

భారత్-పాక్ మ్యాచ్​ చూడాలనుకుంటున్నా: ఐసీసీ ఛైర్మన్

author img

By

Published : Nov 30, 2020, 1:09 PM IST

టెస్టు ఛాంపియన్​ లక్ష్యం నెరవేరిందో లేదో తనకైతే తెలియదని ఐసీసీ కొత్త అధ్యక్షుడు గ్రెగ్ బార్​క్లే అన్నారు. కరోనా వల్ల విరామంతో టోర్నీలోని లోపాలు బయటపడ్డాయని తెలిపారు.

World Test C'ship hasn't achieved what it intended to do: ICC chairman Barclay
'ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​తో​ అనుకున్నది సాధించలేదు'

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గ్రెగ్​​ బార్​క్లే.. ప్రతిష్ఠాత్మక టెస్టు ఛాంపియన్​షిప్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా లాక్​డౌన్​ వల్ల టోర్నీ నిర్వహణలోని లోపాలు బయపడ్డాయని అన్నారు. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్​ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.

"టెస్టు ఛాంపియన్​షిప్​ను కుదించాలని నేను అనుకోను. కరోనా వల్ల ఛాంపియన్​షిప్​లోని లోపాలు బయటపడ్డాయని భావిస్తున్నాను. టెస్టు క్రికెట్​ను అభివృద్ధి చేసే క్రమంలో ఛాంపియన్​షిప్​ లాంటి టోర్నీలు నిర్వహించడం వల్ల దానిపై మరింత ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ, నా దృష్టిలో అది జరగదు. దీన్ని రూపొందించిన వ్యక్తి ఆధారంగా దీనికి చాలా భవిష్యత్తు ఉంది. కానీ, ప్రాక్టికల్​గా దాన్ని నేను అంగీకరించలేను. దాని వల్ల చేయాలనుకున్నది చేశారో లేదా నాకు తెలియదు"

- గ్రెగ్​ బార్​క్లే, ఐసీసీ అధ్యక్షుడు

దీంతో తొలి టెస్టు ఛాంపియన్​షిప్ టోర్నీనే చివరిదని ఐసీసీ ఛైర్మన్​ గ్రెగ్​ పరోక్షంగా చెప్పారు. ఈ ఛాంపియన్​షిప్​ చిన్న బోర్డులకు ​సరిపోదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయమై కొన్ని సభ్య దేశాలతో తనకు మద్దతు ఉందని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం క్రికెట్​ క్యాలెండర్​ను పునరుద్ధరించాలని బార్​క్లే అంగీకరించాడు.

ఆ మ్యాచ్​ చూడాలనుకుంటున్నా

భారత్​ - పాకిస్థాన్​ ద్వైపాక్షిక క్రికెట్​ను తాను మళ్లీ చూడాలనుకుంటున్నట్లు గ్రెగ్​ బార్​క్లే స్పష్టం చేశారు. ఇది ఆదేశం కాదని.. భౌగోళిక రాజకీయ అంశాలు దానితో ముడిపడి ఉన్నాయని తనకు అర్థం అవుతుందని తెలిపారు. బీసీసీఐ లాంటి బోర్డుల బలమైన సభ్యుల ప్రాముఖ్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను యథావిధిగా నిర్వహిస్తామని ఐసీసీ ఇటీవలే స్పష్టం చేసింది. లార్డ్స్​ వేదికగా 2021 జూన్​లో జరగబోయే తుదిపోరు కోసం ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల విజయాలతో పాయింట్లను ఇవ్వాలని నిర్ణయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.