క్రికెట్ ప్రపంచకప్‌ను ముద్దుగా 'ఒలింపిక్స్ ఆఫ్ క్రికెట్' అని పిలుస్తారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీ కోసం క్రికెటర్లే కాకుండా వివిధ దేశాల అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది ఇంగ్లండ్& వేల్స్ సంయుక్త వేదికగా ఈ టోర్నీ జరగనుంది. లండన్ బకింగ్‌హామ్ పాలెస్ వేదికగా ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫ్లింటాఫ్‌తో పాటు శిబానీ దండేకర్, ప్యాడీ మెక్గీన్స్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్, భారత్ కెప్టెన్ కోహ్లీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
"తొలి మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఇక్కడ ఉన్నందుకు గర్విస్తున్నా." -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లండ్ కెప్టెన్
"ఇక్కడున్నందుకు ఆనందంగా ఉంది. అభిమానుల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఓవైపు ఒత్తిడి ఉన్నా, మరోవైపు గర్వంగానూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నా." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
వీరితో పాటే మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వివ్ రిచర్డ్స్, బ్రెట్‌లీ, కెవిన్ పీటర్సన్, కలిస్ తదితరులు హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఓవల్ వేదికగా గురువారం ప్రారంభం కానున్న ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.
ఇది చదవండి: WC 19: ప్రపంచకప్ వేదికలు... వాటి సామర్థ్యాలు