మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. వాషింగ్టన్లోని క్యాపిటల్ వన్ ఏరియాలో పాక్-అమెరికన్లతో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరై తమ దేశ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ జట్టును తయారు చేస్తున్నామని చెప్పారు.
"వచ్చే ఐసీసీ టోర్నీ కోసం అత్యుత్తమ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాం. నా మాటలు గుర్తు పెట్టుకోండి." -ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధానమంత్రి
ఇది ఎలా అమలు జరుపుతారనే విషయం మాత్రం చర్చించలేదు ఇమ్రాన్ ఖాన్. ఈయన రాజకీయాల్లోకి రాకముందు క్రికెటర్గా రాణించారు. 1992 ప్రపంచకప్ గెలిచి పాక్ జట్టులో సభ్యుడు.
ఇటీవలే ప్రపంచకప్లో పాల్గొన్న పాకిస్థాన్.. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఓడి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
ఇది చదవండి: భారత్- పాక్ మ్యాచ్ బంతి ఎంతకి అమ్మారంటే..!