ఐపీఎల్లో పురుషుల ఆటను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. నేటి నుంచి మహిళా టీ20 లీగ్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు జట్లు పాల్గొంటున్నాయి. భారత మహిళా క్రికెటర్లు స్మృతి మందాన ట్రయల్‌బ్లేజర్స్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్నోవాస్ జట్టును నడిపించనుంది. మిథాలీరాజ్ వెలాసిటీ జట్టుకు కెప్టెన్‌గా ఉండనుంది.
మూడు జట్లలో కలిపి మొత్తం 27 మంది భారత క్రికెటర్లు పాల్గొంటారు. వీరికి ఇదో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. జమ్ము కశ్మీర్ అమ్మాయి జాసియా అక్తర్ స్మృతి జట్టు తరఫున ఆడనుంది.
భారత్‌తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా మధ్య విభేదాల కారణంగా ఈ లీగ్‌కు ఆసిస్ మహిళా క్రికెటర్లు దూరంగా ఉండనున్నారు.
లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2 జట్లు ఫైనల్‌కు చేరతాయి.
నేడు జైపుర్ వేదికగా మొదటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని సూపర్నోవాస్, స్మృతి మందాన ట్రయల్ బ్లేజర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఇవీ చూడండి.. యాదృచ్ఛికమే... కానీ ఇదే నిజం....