మహిళల బిగ్‌బాష్ లీగ్ 5వ సీజన్ విజేతగా బ్రిస్బేన్ హీట్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండో టైటిల్ ఎగరేసుకుపోయింది బ్రిస్బేన్. అడిలైడ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది.
-
Beth Mooney set the benchmark all season, and today, her unbeaten 65 was the difference for the @HeatBBL 💪#WBBL05 #WBBLFinals pic.twitter.com/7N96jdk9Vq
— Rebel Women's Big Bash League (@WBBL) December 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Beth Mooney set the benchmark all season, and today, her unbeaten 65 was the difference for the @HeatBBL 💪#WBBL05 #WBBLFinals pic.twitter.com/7N96jdk9Vq
— Rebel Women's Big Bash League (@WBBL) December 8, 2019Beth Mooney set the benchmark all season, and today, her unbeaten 65 was the difference for the @HeatBBL 💪#WBBL05 #WBBLFinals pic.twitter.com/7N96jdk9Vq
— Rebel Women's Big Bash League (@WBBL) December 8, 2019
ఈ మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న బ్రిస్బేన్ క్రీడాకారిణి బెత్(56) మూనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో అత్యధికంగా 769 పరుగులు చేసిన సోఫీ డివైన్‌కు(అడిలైడ్) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం లభించింది. 16 ఇన్నింగ్స్‌ల్లో 76.90 సగటుతో ఈ స్కోరు సాధించింది సోఫీ.
మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులో అమాండా వెల్లింగ్టన్(55), తహిలా మెక్‌గ్రాత్(33) మినహా మిగతా బ్యాట్స్ఉమెన్ విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. బ్రిస్బేన్ బౌలర్లలో జార్జియా, జెస్ జొనాసెన్ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన బ్రిస్బేన్ జట్టులో ఓపెనర్ బెత్ మూనీ అర్ధశతకంతో అదరగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరిసింది జెస్. 33 పరుగులతో చక్కటి ప్రదర్శన చేసింది. అడిలైడ్ బౌలర్లలో తహిలా మెక్‌గ్రాత్ 2, సారా, సోఫీ డివైన్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: కోహ్లీ ముంగిట మరో రికార్డు... 25 పరుగుల దూరంలోనే.