ETV Bharat / sports

'మళ్లీ ఆడాలంటే నాలుగు వారాల శిక్షణ అవసరం' - దినేశ్ కార్తీక్ తాజా వార్తలు

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్​డౌన్ వల్ల క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. మళ్లీ టోర్నీలు ప్రారంభమవుతున్న సమయంలో శిక్షణపై దృష్టిసారించారు. అయితే మళ్లీ మ్యాచ్​లో పాల్గొనాలంటే కనీసం నాలుగు వారాల శిక్షణ అవసరమని అంటున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్.

Dinesh Karthik
కార్తీక్
author img

By

Published : Jun 8, 2020, 10:02 AM IST

కరోనా వైరస్ ప్రభావంతో క్రికెట్ టోర్నీలు రద్దయ్యాయి. ఫలితంగా క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. రెండున్నర నెలలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే కనీసం నాలుగు వారాల శిక్షణ అవసరమంటున్నాడు టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్.

"మళ్లీ పూర్వ స్థితిలా ఫిట్​నెస్ సాధించాలంటే కాస్త సమయం పడుతుంది. నాలుగు వారాల పాటు శిక్షణ అవసరం. మొదట కాస్త నెమ్మదిగా కసరత్తులు ప్రారంభించి తర్వాత పెంచుతూ పోవాలి. ప్రస్తుతం చెన్నైలో లాక్​డౌన్ కొనసాగుతోంది. ప్రాక్టీస్​కు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. దాని గురించే ప్రయత్నిస్తున్నా. నెమ్మదిగా ప్రాక్టీస్ ప్రారంభిస్తా. ఇన్ని రోజులు ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల జాంబీలా తయారయ్యా."

-కార్తీక్, టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్

టీమ్​ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్​ కుడా క్రీడాకారులకు శిక్షణ అవసరమని తెలిపాడు. కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల ప్రాక్టీస్​ చేయాలని అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.