ETV Bharat / sports

ఈడెన్ గార్డెన్స్​లో అభిమానుల ఎనర్జీ ఈసారి మిస్

author img

By

Published : Sep 10, 2020, 12:05 PM IST

కరోనా కారణంగా ఈసారి ఈడెన్ గార్డెన్స్​లో అభిమానుల అరుపులు, కేకలను మిస్ అవుతామని చెప్పాడు కోల్​కతా జట్టు కెప్టెన్ దినేశ్ కార్తిక్.

Will miss energy of Eden Gardens: Dinesh Karthik
దినేశ్​ కార్తిక్​

ఐపీఎల్​లో ఆడేటప్పుడు స్టేడియంలోని అభిమానుల ఉత్సాహం వల్ల తమకు శక్తి లభిస్తుందని చెప్పిన దినేశ్​ కార్తిక్​.. ఈసారి కరోనా వల్ల దానిని మిస్ అవుతున్నట్లు చెప్పాడు. కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్​గా, ప్రఖ్యాత ఈడెన్​ గార్డెన్స్​లో ఆడిన​ మ్యాచ్​లను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.

"ఈడెన్​ గార్డెన్స్​లో మా అభిమానులు ఇచ్చే శక్తిని ఈ ఏడాది కోల్పోనున్నాం. అందువల్ల కోల్​కతా​ ఫ్యాన్స్​తో మేం మమేకమవ్వాలని భావిస్తున్నాం. వారు ప్రస్తుతం మైదానాల్లో లేకపోయినా, ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతారు"

- దినేశ్​ కార్తిక్​, కోల్​కతా నైట్​రైడర్స్​ సారథి​

అభిమానులతో చర్చించడంలో భాగంగా 'తూ ఫ్యాన్​ నహి తుపాన్​ హై' అనే కార్యక్రమాన్ని పాల్గొన్నాడు దినేశ్​ కార్తిక్​. కరోనా వల్ల ఐపీఎల్​ను యూఏఈలో జరుపుతున్న తరుణంలో కోల్​కతా ఫ్యాన్స్​తో వర్చువల్​గా జట్టు మొత్తం మాట్లాడటానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పశ్చిమ బంగా రాష్ట్రం ఈ ఏడాది రెండు ప్రకృతి విపత్తులను ఎదుర్కొంది. అందులో మొదటిది కరోనా వైరస్​ కాగా రెండోది​ తుపాను. ఇన్నాళ్లు కోల్​కతా ప్రజలు తమ జట్టుకు అండగా ఉన్నారని .. ప్రస్తుతం వారి ముఖంలో ఆనందం కోసం ఐపీఎల్​ ట్రోఫీ గెలిచి ఇవ్వడమే తమ కర్తవ్యమని దినేశ్​ కార్తిక్​ అన్నాడు.

ఐపీఎల్​ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. టోర్నీలో కోల్​కతా నైట్​రైడర్స్​ తొలి మ్యాచ్​లో భాగంగా సెప్టెంబరు 23న ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.