న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది టీమిండియా. రోహిత్ తొలుత అర్ధశతకం, ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది అద్భుత ప్రదర్శన చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ విజయం అందుకుంది కోహ్లీసేన.
ప్రణాళికలకు సమయమేది?
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో బుమ్రా 4 ఓవర్లు వేసి అత్యధిక పరుగులు (45) ఇవ్వగా.. అతడితోనే సూపర్ ఓవర్ వేయించాడు కోహ్లీ. ఆ ఓవర్‌లోనూ బుమ్రా 17 పరుగులిచ్చాడు. ఈ విషయంపై రోహిత్ మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్‌కు దారితీస్తే.. ఆ సమయంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉండదని చెప్పాడు. ఆ రోజు ఆటలో ఏం జరిగిందో దాన్నే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, అందులో ఎవరు బాగా ఆడితే వారినే పంపిస్తారని స్పష్టం చేశాడు.
-
"Ro-Super-Hit" Sharma 💖💖🇮🇳🇮🇳
— Gopal Rozadkar (@GopalRozadkar) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
.
Thanks @ImRo45#rohitsharma #SuperOver #NZvIND #Hitman #India pic.twitter.com/ddMwIv7Oyk
">"Ro-Super-Hit" Sharma 💖💖🇮🇳🇮🇳
— Gopal Rozadkar (@GopalRozadkar) January 29, 2020
.
Thanks @ImRo45#rohitsharma #SuperOver #NZvIND #Hitman #India pic.twitter.com/ddMwIv7Oyk"Ro-Super-Hit" Sharma 💖💖🇮🇳🇮🇳
— Gopal Rozadkar (@GopalRozadkar) January 29, 2020
.
Thanks @ImRo45#rohitsharma #SuperOver #NZvIND #Hitman #India pic.twitter.com/ddMwIv7Oyk
" టీమిండియాలో బుమ్రా కీలకమైన పేసర్. సూపర్ ఓవర్ సమయంలో మాకు వేరే అవకాశం లేదు. ఒక సందర్భంలో షమి, జడేజాలలో ఎవరిచేత అయినా వేయించాలనే సందిగ్ధత నెలకొంది. కానీ చివరికి కచ్చితమైన యార్కర్లు, స్లో బంతులేసే బుమ్రా చేతే వేయించాలని నిర్ణయించాం".
--రోహిత్‌శర్మ, భారత జట్టు ఓపెనర్
బ్యాటింగ్ విషయంలోనూ ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే బరిలోకి దిగుతారని చెప్పాడు హిట్‌మ్యాన్. ఒకవేళ తాను ఈ మ్యాచ్‌లో 65 పరుగులు చేయకుంటే.. సూపర్‌ఓవర్‌లో బ్యాటింగ్ చేసేవాడిని కాదని, తన బదులు శ్రేయస్ అయ్యర్ లేదా వేరే బ్యాట్స్‌మన్ దిగేవారని అన్నాడు రోహిత్. భారత జట్టు ఇప్పటికే 3-0తో సిరీస్ కైవసం చేసుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకి అవకాశం ఇస్తామని కోహ్లీ తెలిపాడు. శుక్రవారం నాలుగో టీ20 జరగనుండగా.. ఆదివారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
- ' class='align-text-top noRightClick twitterSection' data=''>