దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌ను 1-1 తో డ్రా చేసుకుంది. అయితే చివరి మ్యాచ్‌లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. పంత్ బ్యాటింగ్ ఆడుతుండగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లోని అమితాబ్ బచ్చన్ గాత్రాన్ని అనుకరించి మాట్లాడారు వ్యాఖ్యాతలు గావస్కర్, హర్షా భోగ్లే. టీ20ల్లో నాలుగో స్థానానికి సరైన బ్యాట్స్‌మెన్ ఎవరంటూ నెటిజన్లను ప్రశ్నించారు. శ్రేయర్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోమని సూచించారు.
-
This is gold from Sunny G 😁👌
— BCCI (@BCCI) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
How is that for a KBC rendition, Sunny G Style 😎😎#INDvSA pic.twitter.com/ha3uBjusUp
">This is gold from Sunny G 😁👌
— BCCI (@BCCI) September 22, 2019
How is that for a KBC rendition, Sunny G Style 😎😎#INDvSA pic.twitter.com/ha3uBjusUpThis is gold from Sunny G 😁👌
— BCCI (@BCCI) September 22, 2019
How is that for a KBC rendition, Sunny G Style 😎😎#INDvSA pic.twitter.com/ha3uBjusUp
ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్.. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్ ధావన్(36) మినహా అందరూ విఫలమయ్యారు. స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది కోహ్లీసేన. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీలు.. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. కెప్టెన్ డికాక్ 79 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది.
ఇది చదవండి: