ETV Bharat / sports

ఐపీఎల్ మధ్యలో ఆటగాడికి కరోనా వస్తే? - ఐపీఎల్​ వార్తలు

త్వరలో ఐపీఎల్ మొదలు కానున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి విషయంలో బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. మ్యాచ్​ మధ్యలో ఆటగాడికి కరోనా సోకినట్లు తేలితే ఏం చేస్తారనే ప్రశ్నలూ వస్తున్నాయి.

IPL
ఐపీఎల్​
author img

By

Published : Aug 14, 2020, 12:09 PM IST

క్రికెట్​ అభిమానులంతా ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏకైక టోర్నీ​ ఐపీఎల్. కరోనా వల్ల దొరికిన సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ స్థాయిలో జరుగనున్న అతిపెద్ద లీగ్​ ఇదే. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ప్రారంభం కానుంది. బయో సెక్యూర్​ వాతావరణంలో ఆడేందుకు క్రికెటర్లందరూ సిద్ధమవుతున్నారు. ఇన్ని నెలల తర్వాత మళ్లీ అభిమాన క్రికెటర్లను మైదానంలో చూడనున్నామనే ఆనందం ఓవైపు ఉన్నాసరే.. లీగ్​ నిర్వహణపై అనేక సందేహాలు వస్తున్నాయి.

IPL
ఐపీఎల్​

53 రోజుల పాటు సాగే ఐపీఎల్​లో ఆటగాళ్ల సంరక్షణతో పాటు బయట వ్యక్తులతో కలవనీయకుండా​ బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ముఖ్యంగా సీజన్​ మధ్యలో ఆటగాడికి కరోనా వస్తే ఏం చేస్తారు? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లీగ్​ నిర్వహణ కోసం బీసీసీఐ రూపొందించిన ప్రణాళికలు(ఎస్​ఓపీ) ఇవే.

మ్యాచ్​ మధ్యలో ఆటగాడికి కరోనా సోకితే ఏం చేస్తారు?

  • ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా బీసీసీఐ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. బయో బబుల్​లో ఉన్న క్రికెటర్ లేదా సహాయ సిబ్బందికి పరీక్షల్లో పాజిటివ్​గా తేలితే.. వెంటనే వారిని ఐసోలేషన్​లో ఉంచుతారు.
  • ఎవరైనా వైరస్ లక్షణాలతో కనిపిస్తే, రెండు వారాలపాటు ఐసోలేషన్​కు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రత్యేక వైద్య అధికారి వీళ్లను పర్యవేక్షిస్తారు.
  • ఐసోలేషన్​ పూర్తయిన తర్వాత.. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు చేసే పరీక్షల్లో నెగిటివ్​ రావాలి. అప్పుడే వారిని తిరిగి బబుల్​లోకి అనుమతిస్తారు. తిరిగి శిక్షణ ప్రారంభించే ముందు కార్డియాక్​ స్క్రీనింగ్​ కూడా చేయనున్నారు.
    IPL
    ఐపీఎల్​

యూఏఈకి పయనం అప్పుడే

  • ఇటీవలే లీగ్​ జరుగుతున్నప్పుడు పాటించాల్సిన నిబంధనలను బీసీసీఐ ప్రకటించింది. యూఏఈలో ఐపీఎల్​ నిర్వహణకు కేంద్రం కూడా అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలన్నీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. ఆగస్టు 20-23 మధ్య ప్రత్యేక విమానాల్లో జట్లన్నీ యూఏఈకి చేరుకోనున్నాయి.
  • ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు నేరుగా యూఏఈకి రానున్నారు. ప్రయాణానికి వారం ముందు వారందరికీ పరీక్షలు జరుపుతారు. నెగిటివ్​ నిర్ధరణ అయిన క్రికెటర్లు లీగ్​లో భాగం కానున్నారు.
  • యూఏఈ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పరీక్షలు జరపనున్నారు. అనంతరం ఏడు రోజుల పాటు హోటళ్లలో క్వారంటైన్​లో ఉండనున్నారు. ఆ సమయంలో మరో మూడుసార్లు కొవిడ్​ పరీక్షలు చేస్తారు. వీటిన్నింటిని దాటుకొని వచ్చినవారే బయో సెక్యూర్​ వాతావరణంలోకి అడుగుపెడతారు.
  • లీగ్​ జరిగినన్ని రోజులు ఆటగాళ్లు వేరొకరిని కలిసేందుకు, ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే.. బోర్డు ఆగ్రహానికి గురి కాక తప్పదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.