ETV Bharat / sports

బీసీసీఐ విరాళాన్ని విండీస్​ క్రికెట్​ బోర్డు ఏం చేసింది? - michael holdings

భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ), వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డుకు ఇచ్చిన విరాళం దుర్వినియోగం అయిందని ఆ దేశ మాజీ క్రికెటర్​ మైకెల్​ హోల్డింగ్స్​ ఆరోపించాడు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని అన్నాడు.

What did the Westindies Cricket Board of the BCCI donate?
బీసీసీఐ విరాళాన్ని విండీస్​ క్రికెట్​ బోర్డు ఏం చేసింది?
author img

By

Published : May 21, 2020, 10:13 AM IST

వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు బీసీసీఐ ఇచ్చిన ఐదు మిలియన్‌ డాలర్ల విరాళం దుర్వినియోగమైందని వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ మైకెల్‌ హోల్డింగ్‌ ఆరోపించాడు. విండీస్‌ బోర్డు ఆర్థిక నిర్వహణ బాగా లేదని అన్నాడు.

"2013-14లో బీసీసీఐ.. వెస్టిండీస్‌ మాజీ ఆటగాళ్ల కోసం ఐదు మిలియన్‌ డాలర్ల విరాళమిచ్చింది. నాకేమీ వద్దు కానీ నేనూ మాజీ ఆటగాణ్నే. ఒక్క మాజీ ఆటగాడికైనా విండీస్‌ బోర్డు డబ్బులిచ్చినట్లు నేను వినలేదు. ఇచ్చి ఉంటే చాలా ప్రచారం చేసుకునేవాళ్లు. ఆ ఐదు మిలియన్‌ డాలర్లు ఏమయ్యాయి? త్వరలోనే వివరాలు వెల్లడిస్తా" అని హోల్డింగ్‌ చెప్పాడు.

ఇదీ చూడండి.. '28 ఏళ్ల అనుబంధం.. ఇప్పుడు చాలా వెలితిగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.