తమ జట్టు పేస్ బౌలింగ్‌కు ప్రపంచంలోని ఏ జట్టునైనా ఎదుర్కోగల సామర్థ్యం ఉందని ధీమా వ్యక్తం చేశాడు వెస్టిండీస్ సహాయ కోచ్ రోడీ ఎస్ట్‌విక్. ఈ లాక్డౌన్ సమయంలో బౌలర్లు ఫిట్నెస్ను మరింత పెంచుకున్నారని అన్నాడు. జూన్ 8న ఇంగ్లాండ్‌తో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లో తమ సత్తా చూపిస్తారని వెల్లడించాడు.
కీమర్ రోచ్, గ్యాబ్రియల్, అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారని.. ఈ లాక్డౌన్ సమయంలో వారు మరింత రాటుదేలారని రోడీ తెలిపాడు. 1970, 80 కాలం నాటి జట్టు పేస్ సామర్థ్యాలను వీరు కూడగట్టుకున్నారని అన్నాడు. అండర్సన్, ఫిలిప్ కూడా బలమైన బౌలర్లగా రూపుదిద్దుకున్నారని వెల్లడించాడు.
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మూడు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ జులై 8 నుంచి ప్రారంభంకానుంది. ప్రేక్షకులు లేకుండానే దీనిని నిర్వహిస్తున్నారు. జులై 8 నుంచి 12 వరకు తొలి టెస్టు జరుగుతుంది. అనంతరం ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జులై 16 నుంచి 20, 24 నుంచి 28 వరకు రెండు, మూడు టెస్టులు జరుగుతాయి.
ఇది చూడండి : 'ఈసారి స్నేహానికి చోటు లేదు.. యుద్ధమే'