ETV Bharat / sports

సౌథాంప్టన్​ టెస్ట్​: విండీస్​ 318 ఆలౌట్​- ఇంగ్లాండ్​పై ఆధిక్యం - ఇంగ్లాండ్​ vs వెస్టిండీస్ టెస్ట్​ మ్యాచ్​

సౌథాంప్టన్​ వేదికగా జరుగుతోన్న తొలిటెస్ట్​ మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​పై వెస్టిండీస్​ పైచేయి సాధించింది. 318 పరుగులు చేసి ఆలౌట్ అయిన కరీబియన్ జట్టు​ 114 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్​ బ్యాట్స్​మెన్​లో బ్రాత్​వైట్​, షేన్​ డౌరిచ్​లు అర్ధ సెంచరీలతో అలరించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్​ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 పరుగులు చేసింది. ​

West Indies lead England by 114 runs on 1st innings on Day 3
సౌథాంప్టన్​ టెస్ట్​: విండీస్​ 318 ఆలౌట్​- ఇంగ్లాండ్​పై ఆధిక్యం
author img

By

Published : Jul 11, 2020, 5:05 AM IST

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్​లో మూడో రోజు పర్యటక వెస్టిండీస్​ జట్టు అధిపత్యం సాధించింది. విండీస్​ బ్యాట్స్​మెన్​ బ్రాత్​వైట్​(125 బంతుల్లో 65 పరుగులు), వికెట్​ కీపర్​ షేన్​ డౌరిచ్(115 బంతుల్లో 61 పరుగులు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్​లో 204 పరుగులు చేసిన ఇంగ్లాండ్​ స్కోరును అధిగమించిన కరీబియన్​ జట్టు.. 114 పరుగుల ఆధిక్యంలో ఉంది.

57-1 పరుగులతో మూడోరోజు ఆటను ప్రారంభించిన విండీస్​.. రెండో సెషన్​లో ఇంగ్లండ్​ స్కోరు(204)ను అధిగమించింది. ఇదే క్రమంలో బ్యాట్స్​మెన్​ నిలదొక్కుకుని ఆడుతూ వికెట్​కు కాపాడుకున్నారు. అయితే మరో గంటలో ఆట ముగుస్తుందనగా.. 318 పరుగులకు అలౌట్​ అయింది కరీబియన్​ జట్టు.

10 ఓవర్లకు 15 పరుగులు

అనంతరం రెండో ఇన్నింగ్స్​ను ప్రారంభించింది ఇంగ్లాండ్​. వికెట్​ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చిన ఓపెనర్లు రోరీ బర్న్స్​(10), డోమ్​ సిబ్లీ(5).. 10 ఓవర్లపాటు జాగ్రత్తగా ఆడి 15 పరుగులు చేశారు.

ఇదీ చదవండి: ఈ యువ ఆటగాళ్లలో 'హిట్​మ్యాన్ 2.0' ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.