ETV Bharat / sports

'క్రికెట్​లోనూ జాతి వివక్ష ఉంది.. నేనే బాధితుడిని'

నల్లజాతి అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి సంతాపం తెలిపిన వెస్టిండీస్​ స్టార్​ క్రికెటర్​ క్రిస్​గేల్​ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. అన్ని క్రీడల్లాగే క్రికెట్​లోనూ వర్ణ వివక్ష ఉందన్నాడు. వాటిని తానూ ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశాడు.

Cricket not free of racism, I faced it too: Chris Gayle
క్రికెట్​లోనూ జాతి వివక్షత ఉంది.. అందుకు నేనే సాక్ష్యం: గేల్​
author img

By

Published : Jun 2, 2020, 11:56 AM IST

వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌, యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ ఆట గురించి తెలియని క్రికెట్​ ప్రియులు ఉండరు. అలాంటి ఆటగాడు జాతి వివక్ష ఎదుర్కొన్నట్లు తాజాగా వెల్లడించాడు. అగ్రరాజ్యంలో నల్లజాతి అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి సంతాపం తెలిపిన ఈ విండీస్​ ప్లేయర్​... అనంతరం జాతి వివక్షపై వ్యాఖ్యలు చేశాడు. అన్ని క్రీడల్లాగే క్రికెట్‌లోనూ వర్ణ వివక్ష ఉందని చెప్పాడు. అయితే ఎవరూ తనకి ఇబ్బందులు సృష్టించారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఓ గ్లోబల్​ టీ20 లీగ్​లోనే ఆ అవమానం ఎదుర్కొన్నట్లు చెప్పాడు.

Chris Gayle racism remarks
వెస్టిండీస్​ స్టార్​ క్రికెటర్​ క్రిస్​గేల్​

" క్రికెట్​ టోర్నీల్లో భాగంగా వివిధ దేశాల్లో పర్యటించాను. ఆ సమయంలో నా రంగు కారణంగా వివక్షతను ఎదుర్కొన్నాను. నల్ల జాతీయులు కూడా అందరిలాంటి వారే. మమ్మల్ని ద్వేషించొద్దు. నలుపు అనేది బలం, నలుపే గర్వకారణం" అని గేల్​ చెప్పాడు. ప్రస్తుతం 'బ్లాక్​ లివ్స్​ మ్యాటర్​','ఐ కాంట్​ బ్రీత్​' నినాదాలతో అగ్రరాజ్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: క్రికెటర్ ఆర్చర్​పై వర్ణ వివక్ష​.. కివీస్ బోర్డు క్షమాపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.