ఆస్ట్రేలియాపై తాను ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌తో బుధవారం ప్రత్యేక ముఖాముఖిలో కోహ్లీ ముచ్చటించారు. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ జట్టుపై తాను ఉత్తమ ప్రదర్శన కనబరచినట్లు వెల్లడించాడు.
-
Ahead of the first Test against Australia, @imVkohli and @stevesmith49 recall memories from the 2014-15 series.
— BCCI (@BCCI) December 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch the full interview here - https://t.co/3jEYM9zxzV #AUSvIND pic.twitter.com/d0jpVSNnPd
">Ahead of the first Test against Australia, @imVkohli and @stevesmith49 recall memories from the 2014-15 series.
— BCCI (@BCCI) December 16, 2020
Watch the full interview here - https://t.co/3jEYM9zxzV #AUSvIND pic.twitter.com/d0jpVSNnPdAhead of the first Test against Australia, @imVkohli and @stevesmith49 recall memories from the 2014-15 series.
— BCCI (@BCCI) December 16, 2020
Watch the full interview here - https://t.co/3jEYM9zxzV #AUSvIND pic.twitter.com/d0jpVSNnPd
"నాకు ఇష్టమైన ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే అది నీకు(స్మిత్) నచ్చకపోవచ్చు. 2016 టీ20 ప్రపంచకప్‌లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్ నాకు స్పెషల్. ఆ సమయంలో నాకు ఏది అర్థం కాలేదు. ట్రాన్స్మోడ్లోకి వెళ్లాను. నేను కొట్టే ప్రతి బంతి గ్యాప్‌ల ద్వారా బౌండరీలను చేరింది. అలా బ్యాటింగ్‌లో స్థిరంగా నిలిచాను. మీరు (ఆస్ట్రేలియా జట్టు) చాలా ఒత్తిడికి లోనయ్యారు. అది నాకు ఎప్పటికీ ప్రత్యేకమే".
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
మొహాలీ వేదికగా 2016 టీ20 ప్రపంచకప్‌లో జరిగిన సెమీఫైనల్ అర్హత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఛేదనలో దిగిన భారత జట్టు ఒక దశలో 94 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. అప్పుడు క్రీజ్‌లో ఉన్న ధోనీ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.
ఆ మ్యాచ్‌లో కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమ్ఇండియాను గెలుపు తీరాలను చేర్చాడు. ఇందులో విజయం దక్కించుకుని భారత జట్టు సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌తో తలపడింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. అడిలైడ్ ఓవల్‌లో డే/నైట్ మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: టీమ్ఇండియాకు ఈ రెండు సిరీస్‌లు కీలకం!