ETV Bharat / sports

'నాలుగో టెస్టు బ్రిస్బేన్​లోనే నిర్వహించాలి' - భారత్​, ఆస్ట్రేలియా గబ్బా టెస్టు

టీమ్​ఇండియాతో ఆడాల్సిన నాలుగో టెస్టును బ్రిస్బేన్​ వేదికగానే నిర్వహించాలని సూచిస్తున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్​ మాథ్యూ వేడ్​. ప్రణాళిక ప్రకారమే సిరీస్​ను జరపాలని.. సిడ్నీలో మరో మ్యాచ్​ ఆడేందుకు తమ జట్టు సిద్ధంగా లేదని తెలిపాడు.

We won't prefer back-to-back matches in SCG, looking forward to final Test at Gabba: Wade
'నాలుగో టెస్టు బ్రిస్బేన్​లోనే నిర్వహించాలి'
author img

By

Published : Jan 3, 2021, 12:46 PM IST

టీమ్ఇండియాతో ఆఖరి టెస్టును బ్రిస్బేన్​లోనే ఆడతామని ఆస్ట్రేలియా ఓపెనర్​ మాథ్యూ వేడ్​ అన్నాడు. అందుకుగానూ క్వారంటైన్​ వంటి కఠిన బయోబబుల్​ నియమావళిని పాటించాల్సి ఉంటుందని వెల్లడించాడు. ఆ సవాళ్లకు ఆసీస్​ జట్టు సిద్ధంగా ఉందని వేడ్​ స్పష్టం చేశాడు. అయితే ఆసీస్​కు వచ్చినప్పుడే 14రోజుల క్వారంటైన్​లో ఉన్న భారత్​.. బ్రిస్బేన్​లో మరోసారి కఠిన నిర్బంధంలో ఉండడానికి అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం.

"బ్రిస్బేన్​లో ఆడేందుకు భారత్ సుముఖంగా లేదని నేను వినలేదు. సిడ్నీలోనే నాలుగో టెస్టు ఆడాలని మేము అనుకోవడం లేదు. వేసవిలో విడుదల చేసిన షెడ్యూల్​ అమలుకు క్రికెట్ ఆస్ట్రేలియా కట్టుబడి ఉంది. దానికి అనుగుణంగానే గబ్బా మైదానంలో ఆడాలనుకుంటున్నాం తప్ప వేరే కారణాలేవీ లేవు. అది క్వారంటైన్ హోటల్​ అయినా సరే, గ్రౌండ్​కు వెళ్లి మళ్లీ తిరిగి రావాల్సిందే. ​వేదికలో మార్పు ఉందని చెప్పేంతవరకు ఎక్కడ ఆడడానికైనా మేము సిద్ధం."

-​ వేడ్, ఆస్ట్రేలియా ఓపెనర్​

బ్రిస్బేన్​ వేదికగా జనవరి 15నుంచి 19వరకు నాలుగో టెస్టు జరగనుంది. జనవరి 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: బ్రిస్బేన్​ టెస్టులో టీమ్​ఇండియా ఆడడం సందేహమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.