ETV Bharat / sports

'కోహ్లీని రెచ్చగొడితే రెడ్​జోన్​లో ఉన్నట్లే'

author img

By

Published : Jul 4, 2020, 8:47 PM IST

భారత కెప్టెన్​ కోహ్లీని మైదానంలో రెచ్చగొట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు ఆసీస్ పేసర్​ హేజిల్​వుడ్. విరాట్​ను స్లెడ్జింగ్​ చేస్తే బౌలర్లు ప్రమాదంలో పడ్డట్లేనని అభిప్రాయపడ్డాడు.

We stay clear of engagement with Kohli as it brings out the best in him: Hazlewood
కోహ్లీ

టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీని స్లెడ్జింగ్​ చేయడమంటే రెడ్​ జోన్​లో ఉన్నట్లేనని ఆస్ట్రేలియా పేసర్​ జోష్​ హేజిల్​వుడ్​ అభిప్రాయపడ్డాడు. విరాట్ బ్యాటింగ్​ చేస్తున్నప్పుడు అతడిని రెచ్చగొట్టే పనులేవీ చేయకూడదని తమ జట్టు బౌలర్లు నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. స్టార్​స్పోర్ట్స్​ క్రికెట్​ షోలో ఇటీవలే మాట్లాడిన హేజిల్​వుడ్​.. పలు విషయాలు పంచుకున్నాడు.

"మేం ఈ టెస్టు సిరీస్​లో ఘర్షణలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాం. చివరి మ్యాచ్​ వరకు ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలుచేస్తామని భావిస్తున్నా. కోహ్లీ తగాదాలను బాగా ఇష్టపడతాడు. ఎందుకంటే అదే అతడిలోని అత్యుత్తమ ఆటగాడిని బయటికి తెస్తుంది. ముఖ్యంగా విరాట్ బ్యాటింగ్​ చేస్తున్న సమయం బౌలర్లకు నో గో జోన్​ లాంటింది"

జోష్​ హేజిల్​వుడ్​, ఆస్ట్రేలియా పేసర్​

ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాటింగ్​ చేస్తూ.. కోహ్లీ మైదానంలో ఫీల్డింగ్​లో ఉంటే పరిస్థితి భిన్నంగా ఉంటుందని హేజిల్​వుడ్​ పేర్కొన్నాడు.

"మా వాళ్లు బ్యాటింగ్​ చేస్తూ.. కోహ్లీ ఫీల్డింగ్​లో చేస్తుంటే అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ విరాట్ బ్యాటింగ్​ చేస్తున్నప్పుడు అలా వదిలేయడమే మంచింది. ఆ విధంగా కోహ్లీని స్విచ్​ ఆఫ్​ మూడ్​లోకి తీసుకొచ్చి.. తద్వారా ప్రయోజనాన్ని పొందొచ్చు" అని హేజిల్​వుడ్ చెప్పాడు.

ఈ ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమ్​ఇండియా. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు ఆడనుంది.

ఇదీ చూడండి:'నెట్ ప్రాక్టీసులో గావస్కర్​ చెత్త ఆటగాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.