విశాఖపట్నం వేదికగా జరిగిన టీమిండియా-దక్షిణాఫ్రికా తొలిటెస్టులో కోహ్లీసేన భారీ విజయం సొంతం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో తనదైన పేస్ బౌలింగ్‌తో చెలరేగిపోయాడు మహ్మద్ షమి. ఈ పేసర్ అద్భుతమైన ప్రదర్శన వెనుక ఓ రహస్యం ఉందని చెప్పాడు ఓపెనర్ రోహిత్‌శర్మ.
" ఈ మధ్య కాలంలో షమి బాగా ఆడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ సత్తాచాటాడు. చాలా నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఇలా అదరగొట్టడం వెనుక ఓ రహస్యం ఉంది. బిర్యానీ తిన్న తర్వాత ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. అప్పుడే అతడిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకి వస్తుంది" -- ఓపెనర్ రోహిత్‌శర్మ, భారత ఓపెనర్
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదిన రోహిత్ శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్... ఏదో ఓ రోజు ఓపెనింగ్ చేయాల్సి వస్తుందని, యాజమాన్యం రెండేళ్ల క్రితమే చెప్పిందన్నాడు. అందుకే నెట్స్‌లోనూ కొత్త బంతితోనే సాధన చేసినట్లు చెప్పాడు.
ఇదీ చదవండి....