మెల్బోర్న్ స్టార్స్‌కు మరో స్టార్ క్రీడాకారిణి తోడయ్యింది. లీగ్ ఆరంభంలోని తొలి రెండు సీజన్లలో ఇదే జట్టును ముందుండి నడిపించిన మెగ్ లానింగ్.. ఆరో సీజన్ ప్రారంభానికి ముందు సొంత గూటికి చేరింది. అక్టోబర్‌లో మహిళల బిగ్‌బాష్ లీగ్-2020 మొదలుకానుంది.
తొలి రెండు సీజన్లలో మొత్తం 27 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించింది మెగ్ లానింగ్. బ్యాటింగ్‌లోనూ 50 సగటుతో 1062 పరుగులు చేసి.. టోర్నీ లీడ్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత పెర్త్ స్కార్చర్స్‌కు మారింది. మూడేళ్ల ఒప్పందం ఇటీవలె ముగియగా.. మళ్లీ స్టార్స్ జట్టుకు వచ్చేసింది. గత మూడు సీజన్లలో ఒక సీజన్ మొత్తానికి భుజం గాయం కారణంగా బరిలోకి దిగలేదు.
ప్రస్తుతం మెల్బోర్న్ స్టార్స్ జట్టులో నికోలే ఫాల్తమ్ష హోలీ ఫెర్లింగ్, అలనా కింగ్, మెగ్ లానింగ్, అన్నాబెలే సుథర్లాండ్, ఎలిస్ విలన్నీ ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ.. నవంబర్ 29న ముగియనుంది.