ETV Bharat / sports

వాట్సన్​ ఆల్​టైమ్​ టాప్​ 5 టీ20 బౌలర్లు వీరే! - క్రికెట్ వార్తలు

ఆసీస్​ మాజీ క్రికెటర్​ షేన్​ వాట్సన్​ తన ఆల్​టైమ్​ టాప్​-5 టీ20 బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఇందులో టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాకు చోటు కల్పించాడు.

top 5 T20 bowlers
వాట్సన్
author img

By

Published : Oct 7, 2020, 5:54 AM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ షేన్​ వాట్సన్​ తన ఆల్​టైమ్​ టాప్​-5 టీ20 బౌలర్ల జాబితాలో భారత పేసర్​ జస్ప్రీత్ బుమ్రాకు చోటు కల్పించాడు. బుమ్రాతో పాటు, శ్రీలంక బౌలర్​ మలింగ, పాక్​ మాజీ ఆల్​రౌండర్​ షాహిద్​ అప్రిది, వెస్టిండీస్ ఆటగాళ్లు​ డ్వేన్​ బ్రావో, సునీల్​ నరైన్​ ఈ జాబితాలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీ20 స్టార్​ స్పోర్ట్స్ యూట్యూబ్​ ఛానెల్​లో పోస్ట్ చేశాడు వాట్సన్​.

top 5 T20 bowlers
బుమ్రా
top 5 T20 bowlers
మలింగ

"నా టాప్​ ఐదుగురు టీ20 బౌలర్లలో మొదటి వాడు మలింగ.. అతని యార్కర్​ బౌలింగ్​ ఇంతకు ముందెన్నడూ చూడనిది. భవిష్యత్తులో ఇలాంటి బౌలర్​ పుట్టడం కష్టమే. రెండో స్థానం దక్కించుకున్న వ్యక్తి అఫ్రిది. ప్రస్తుతం అతని బౌలింగ్​ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. టీ20ల్లో అత్యుత్తమ బౌలర్లలో ఇతను ఒకడు."

షేన్ వాట్సన్​, ఆసీస్​ మాజీ క్రికెటర్​

టీమ్​ఇండియా పేసర్​ బుమ్రాను ప్రశంసించిన వాట్సన్​.. అతని ప్రదర్శన అసాధారణమైనదని.. భవిష్యత్తులో అద్భుతమైన కెరీర్​ ఉన్నవాడని పేర్కొన్నాడు. టీ20 క్రికెట్​లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్​గా రికార్డు సాధించిన వెస్టిండీస్​ బౌలర్​ బ్రావోను తన జాబితాలో చేర్చాడు వాట్సన్​. నరైన్​ను కూడా అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పేర్కొన్నాడు.

top 5 T20 bowlers
అఫ్రిది
top 5 T20 bowlers
బ్రావో
top 5 T20 bowlers
నరైన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.